పేపర్ ట్రేడింగ్ అంటే ఏమిటి? Paper Trading in Telugu – Stock Market Telugu

పేపర్ ట్రేడింగ్ అంటే ఏమిటి? ట్రేడింగ్ లో ప్రాక్టీస్ ఎలా చేయాలి? ( How to Practice Trading Without Money )

ఈత నేర్చుకోవాలి అనుకునేవాడు ” ఈత కొట్టడం ఎలా? ” అనే పుస్తకాన్ని చదివితే ఈత రాదు. నీటిలోకి దిగి సాధన చేస్తేనే ఈత వస్తుంది. అదే విధంగా ట్రేడింగ్ నేర్చుకోవాలి అనుకునేవారు స్టాక్ మార్కెట్(Stock Market) లోకి ఎంటర్ అయ్యి ట్రేడింగ్ ప్రాక్టీస్ చేస్తేనే ట్రేడింగ్ మీద నాలెడ్జి వస్తుంది. మొదట్లో కనీసం అవగాహన రావడం కోసం పుస్తకాలు, వీడియో లు ఉపయోగపడతాయి. కానీ వీటి నుండి వచ్చే నాలెడ్జి కన్నా కూడా ట్రేడింగ్ చేస్తేనే మనం ఎక్కువ నేర్చుకోగలం.


మొదట్లో డైరెక్ట్ గా కాకుండా పేపర్ ట్రేడింగ్ చెయ్యండి. అంటే ఉదాహరణ కి మీరు ట్రేడింగ్ చేస్తే ఏ ప్రైస్ దగ్గర షేర్ కొందాం అనుకుంటున్నారో ఆ ప్రైస్ ని నోట్ చేసుకోండి. అలాగే ఏ ప్రైస్ దగ్గర అమ్ముదామనుకుంటున్నారో ఆ ప్రైస్ ని కూడా నోట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఆన్లైన్ లో చేస్తే ఎలా చేస్తారో వాటినే పేపర్ మీద నోట్ చేసుకుని ట్రాక్ చేసుకోండి. ఒకవేళ ఈ పేపర్ ట్రేడింగ్ లో మీకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి అంటే మీరు ఫాలో అవుతున్న స్టాటజీ సరైనదే అని అర్ధం. ఇప్పుడు మీరు స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యి రియల్ మనీ తో ట్రేడింగ్ చెయ్యవచ్చు. ఒకవేళ పేపర్ ట్రేడింగ్ లో నష్టాలు వస్తున్నాయి అంటే మీరు ఫాలో అవుతున్న స్టాటజీ సరైనది కాదు దానిని మార్చాలి అని అర్ధం. 

ఒకవేళ మీకు ఇలా పేపర్ మీద నోట్ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే ఆన్లైన్ లో కొన్ని Virtual Stock Trading వెబ్ సైట్లు ఉంటాయి. వాటిలో మనకు virtual money ని ఇస్తారు. ఈ మనీ తో మనం ట్రేడింగ్ చేసుకోవచ్చు. దీనిలో మనం నిజంగా స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది. ఒకవేళ మీరు Virtual Stock Trading చెయ్యాలనుకుంటే మీకు money control వెబ్సైట్ కి సంబందించిన moneybhai అనే website ఉపయోగపడుతుంది. ఒకసారి ఆ వెబ్సైటు ని చెక్ చెయ్యండి.

కానీ దీనిలో ఉండే చిన్న సమస్య ఏమిటంటే ఇది నిజమైన డబ్బుకాదు కాబట్టి చాలా మంది అంత ఆసక్తిగా దీనిలో ట్రేడింగ్ చెయ్యరు. పోయిన పరవాలేదులే అనే నిర్ల్యక్షం చూపిస్తారు. అలాంటప్పుడు నిజమైన సొంత డబ్బుని పెట్టుబడి పెట్టి ట్రేడింగ్ చెయ్యండి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది కేవలం ప్రాక్టీస్ కోసం చేస్తున్నారు కాబట్టి మనకు లాభాలతో సంబంధం లేదు కాబట్టి 500 లేదా 1000 రూపాయలు ఇలా తక్కువ డబ్బుని మాత్రమే పెట్టుబడి పెట్టి ప్రాక్టీస్ చెయ్యండి. ఎందుకంటే మనం డైరెక్ట్ గా మార్కెట్ లో దిగి ట్రేడింగ్ చేసినపుడే ఎక్కువ నేర్చుకోగలం

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *