How to Be a Successful Investor in Stock Market -Telugu

Tips for Successful Investing in Telugu:

మనం ధనవంతులుగా మారాలంటే డబ్బుని సేవ్ చేయడం కాదు ఇన్వెస్ట్(Invest) చేయడం తెలియాలి. అయితే ఆ డబ్బుని ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చెయ్యకూడదు, ఎలా పడితే అలా ఇన్వెస్ట్(Invest) చెయ్యకూడదు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. స్టాక్ మార్కెట్ (Stock Market) చాలా ఒడిదుడుకులతో కూడుకుని ఉంటుంది. అలాంటి స్టాక్ మార్కెట్ లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను సంపాదించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


Long Term కోసం కొనండి:

లాంగ్ టర్మ్ (Long Term) కోసం అంటే 1 లేదా 2 సంవత్సరాల కోసం కాదు, కనీసం 5 నుండి 10 సంవత్సరాల అయినా స్టాక్ ని Hold చేస్తేనే అది లాంగ్ టర్మ్ అవుతుంది. వారెన్ బఫెట్ గారు ఒక మాట అంటారు.” మీకు ఒక స్టాక్ ని కనీసం 10 సంవత్సరాల పాటు Hold చేయలేకపోతే ఆ స్టాక్ గురించి కనీసం 10 నిముషాలు కూడా ఆలోచించకండి” అని.

అలాగే కొంతమంది స్టాక్ ని కొన్న తరువాత ప్రతి రోజు అవి ఎంత పెరిగాయి, ఎంత తగ్గాయి అని చెక్ చేసుకుంటూ ఉంటారు.

మీరు పది సంవత్సరాల సమయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి తరుచుగా వాటిని చెక్ చేయవలసిన అవసరం లేదు.

ఇలా తరుచుగా చెక్ చేస్తే అనవసరంగా టెన్షన్ పెరుగుతుంది. అలాగే టైం వేస్ట్ కూడా.

వారెన్ బఫెట్ మరొక మాట కూడా అంటారు. ఇప్పటి నుండి 10 సంవత్సలరాల పాటు స్టాక్ మార్కెట్ క్లోజ్ అయిపోయినా సరే మీరు సంతోషంగా Hold చేయగలను అనుకునే స్టాక్స్ లోనే మీరు ఇన్వెస్ట్ చెయ్యండి అని అంటారు. అంతకాలం పాటు Hold చేస్తేనే మంచి లాభాలు వస్తాయి. 1980 లో విప్రో లో 10000 రూపాలు ఇన్వెస్ట్ చేసి ఉంటే 2016 నాటికి వాటి విలువ సుమారుగా 600 కోట్లు పైనే అయింది. అయితే ఎంత మంది ఓపికగా 30సంవత్సరాలు హోల్డ్ చేసి ఉంటారో ,ఎంత మంది అంత రిటర్న్స్ ని పొంది ఉండి ఉంటారు అనేది చెప్పలేం. కాబట్టి లాంగ్ టర్మ్ వ్యూ లోనే ఆలోచించండి. కానీ రోజు వారి స్టాక్ మార్కెట్ లో వచ్చే ఒడిదుడుకులను పట్టించుకోకండి.


Blue Chip Stock లలో ఇన్వెస్ట్ చేయండి:

మనం కష్టపడి సంపాదించిన డబ్బుని, అంత కాలం పాటు ఒక కంపెనీ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అంటే ఏ కంపెనీ లో పడితే ఆ కంపెనీ లో పెట్టుబడి పెట్టకూడదు. మంచి క్వాలిటీ స్టాక్స్ లలో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఇక్కడ క్వాలిటీ స్టాక్స్ అంటే ఫండమెంటల్ (Fundamental) గా బాగుండాలి, కంపెనీ ని నడిపిస్తున్న మేనేజ్ మెంట్ (Management) బాగుండాలి, కంపెనీకి అప్పులు తక్కువగా ఉండాలి, అప్పు లేకపోతే ఇంకా మంచిది, మారుతున్న కాలానికి తగ్గట్టుగా కంపెనీ కొత్త కొత్త ప్రోడక్ట్ లను తీసుకురావాలి. మంచి బ్రాండ్ వేల్యూ ఉండాలి. ఇలాంటి స్టాక్స్ ని ఎంచుకోవాలి. అంతే గాని, తక్కువ రేట్ కి వస్తున్నాయ్ అని, వేగంగా పెరుగుతున్నాయి అని చీప్ స్టాక్ లలో పెట్టుబడి పెట్టకూడదు.

అవి ఎంత వేగంగా పెరుగుతున్నాయో అంతే వేగంగా పడిపోతాయి కూడా. కాబట్టి ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న బ్లూ చిప్ కంపెనీ (Blue Chip Stocks) లలో ఇన్వెస్ట్ చెయ్యండి.


Portfolio ని Diversify చేయండి:

“అన్ని గుడ్లను ఒకే బుట్టలో పెట్టకండి” అని ఒక సూత్రం ఉంటుంది. ఒకవేళ ఆ బుట్ట జారితే మొత్తం గుడ్లన్నీ పగిలిపోతాయి. ఈ సూత్రం స్టాక్ మార్కెట్ (Stock Market) లో కూడా పని చేస్తుంది. మన దగ్గర ఉన్న డబ్బు అంతటిని ఒకే స్టాక్ లో గాని, లేదా ఒకే రంగానికి సంబందించిన స్టాక్స్ లలో గాని ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకవేళ ఆ స్టాక్ ప్రైస్ పడితే, లేదా ఆ రంగానికి ఏదైనా నెగిటివ్ న్యూస్ వస్తే మొత్తం అంత నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి మన Portfolio ని Diversify చేయాలి. అంటే మన దగ్గర ఉన్న మొత్తం డబ్బుని కేవలం స్టాక్స్ లోనే కాకుండా కొంచెం మ్యూచువల్ ఫండ్స్(Mutual Funds), బాండ్స్ (Bonds), గోల్డ్ (Gold), రియల్ ఎస్టేట్ (Real Estate) ఇలా వివిధ పెట్టుబడి మార్గాలలో ఇన్వెస్ట్ చేయాలి.

అలాగే స్టాక్స్ లో Invest చేసే పెట్టుబడిని మొత్తం ఒకే రంగంలో కాకుండా వివిధ రంగాలలోని వివిధ స్టాక్స్ లలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది. ఇలా చేయడం వలన ఒకదానిలో లాస్(Loss) వచ్చిన మరొకదానిలో వచ్చే ప్రాఫిట్(Profit) ఆ లాస్ ని కవర్ చేస్తుంది. రిస్క్ కంట్రోల్ అవుతుంది.


స్టాక్ మీద ప్రేమని పెంచుకోకండి :

మనం పెట్టుబడి పెట్టిన ప్రతి స్టాక్ పెరగాలి అని లేదు. ఒక్కొక్కసారి ఆ కంపెనీ మీద నెగిటివ్ న్యూస్ రావచ్చు, మనం పెట్టిన వాటిలో ఒక్కొక స్టాక్ పెరగకపోవచ్చు. అలాంటపుడు వాటిని నుండి బయటకు వచ్చేసి బాగా పెర్ఫర్మ్ చేసే కంపెనీ లో పెట్టుబడి పెట్టాలి.

కొంతమంది కొన్ని స్టాక్స్ మీద ప్రేమని పెంచుకుంటారు. అవి ఎంత పడిపోతున్న వాటిని అమ్మడానికి ఇష్టపడరు. ఇలాంటి ఎమోషన్స్ కి గురవకూడదు. ఆ కంపెనీని లో ఏమైనా తప్పు ఉంది అని అర్ధం అయితే వెంటనే వాటిని అమ్మేయాలి.

అత్యవసరాల కోసం దాచిన డబ్బుని స్టాక్ మార్కెట్ లో పెట్టకండి.

కొంతమంది పిల్లల పెళ్లి కోసం, పెద్దవాళ్ళ వైద్య ఖర్చుల కోసం దాచిన డబ్బుని స్టాక్ మార్కెట్ లో పెడతారు. మరికొంతమంది అయితే అప్పు చేసి మరీ స్టాక్ మార్కెట్ లో పెడుతుంటారు. ఒకవేళ ఈ డబ్బు కనుక నష్టపోతే చాల ఇబ్బందులు పడవలసి ఉంటుంది.

కాబట్టి మన అవసరాలకు సరిపోగా దాచుకున్న డబ్బు ఏదైతే ఉంటుందో వాటిని మాత్రమే స్టాక్ మర్కెట్ లో ఇన్వెస్ట్ చెయ్యాలి.

ఇలా పైన చెప్పిన వాటిని పాటిస్తూ స్టాక్ మార్కెట్ (Stock Market) లో ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను సంపాదించగలం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *