Option Chain అంటే ఏమిటి? – Option Chain in Telugu -ITM, OTM, ATM Explained

Option Chain in Telugu:

స్టాక్ మార్కెట్ లో Options లో Trading చేయాలంటే ఖచ్చితంగా Option Chain గురించి తెలిసి ఉండాలి. ఇప్పుడు మనం Nifty కి సంబందించిన ఆప్షన్ చైన్ గురించి చూద్దాం. ఇక్కడ మీరు చూస్తున్న దానిని Option Chain అని అంటారు.

option chain in telugu stock market telugu

Option Chain కి మధ్యలో Strike Price లు ఉంటాయి. అలాగే మనం ముందు ఆర్టికల్ లో options లో రెండు రకాలు ఉంటాయి. 1. Call Option (CALLS), 2. Put Option (PUTS) అని చెప్పుకున్నాం. Option Chain లో Strike Price కి ఎడమ వైపున CALLS ఉంటాయి కుడివైపున PUTS ఉంటాయి.

ఈ ఆప్షన్ చైన్ గురించి సులువుగా అర్ధం అవ్వడం కోసం ముందుగా ఎడమ వైపు అంటే కేవలం CALLS ని మాత్రమే చూద్దాం.

Spot Price ని గమనిస్తే 14617 గా ఉంది. జాగ్రత్తగా గమనిస్తే Strike Price లో 14617 దగ్గర నుండి Calls సెక్షన్ లో పైన ఒక కలర్ (Yellow) ఉంది, కింద ఒక కలర్ (White) ఉంది.

Calls కి వచ్చేసరికి Spot Price కన్నా తక్కువగా ఉండే Strike Price లన్ని కూడా In The Money(ITM) లో ఉన్నాయని అంటారు.

అలాగే Spot Price కన్నా ఎక్కువగా ఉండే Strike Price లన్ని కూడా Out Of The Money(OTM) లో ఉన్నాయని అంటారు

Strike Price లలో ఏదైతే Spot Price కి సమానంగా ఉంటుందో దానిని At The Money (ATM) అని అంటారు.

సులువుగా గుర్తించడం కోసం In The Money(ITM) ప్రాంతం అంతా కొద్దిగా Yellow Color ఉంటుంది. Out Of The Money(OTM) ప్రాంతం అంతా White Color లో ఉంటుంది. ఏ ప్రాంతంలో అయితే Yellow Color & White Color కలుస్తాయో అది At The Money (ATM).

ఇదంతా మీరు ఫోటో లో క్లియర్ గా చూడవచ్చు.

తరువాత కుడివైపుకు వస్తే Puts ఉంటాయి. ఇది Calls వ్యతిరేకంగా ఉంటుంది.

Puts కి వచ్చేసరికి Spot Price కన్నా ఎక్కువగా ఉండే Strike Price లన్ని కూడా In The Money(ITM) లో ఉన్నాయని అంటారు

అలాగే Spot Price కన్నా తక్కువగా ఉండే Strike Price లన్ని కూడా Out Of The Money(OTM) లో ఉన్నాయని అంటారు.

Calls కి, Puts కి In The Money(ITM) & Out Of The Money(OTM) opposite గా ఉంటాయి

Key Points –

1. In The Money(ITM) లో ఉండే Option కాంట్రాక్ట్ ల Premiums ఎక్కువగా ఉంటాయి.

2. At The Money (ATM) నుండి దూరంగా వెళ్లేకొద్దీ OTM లోని premiums తగ్గుతూ ఉంటాయి.

3. Expiry అయ్యే టైం కి Out Of The Money(OTM) లో Options Premiums అన్ని Zero అయిపోతాయి. కాబట్టి వాటికి విలువ ఉండదు.

Click Here >> Option Series in Telugu

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *