Options Trading Basics in Telugu – How Options Work – Stock Market Telugu

Options Trading Basics in Telugu:

ఇప్పటి వరకు మనం Options గురించి అర్ధం అవ్వడానికి కావలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు options ఎలా పని చేస్తాయి? మనం ఆప్షన్స్ లో ఎలా ట్రేడింగ్ చెయ్యాలి ?అనేది వివరంగా చూద్దాం. ఈ టాపిక్ ని చాలా జాగ్రత్తగా అర్ధం చేసుకోవాలి.

ఉదాహరణకి ఈ రోజు Monday … Nifty 14700 దగ్గర ఉంది. Nifty కి Weekly Expiry ఉంటుంది కాబట్టి గురువారం నాడు ఈ Nifty సంబంధించిన ఈ కాంట్రాక్ట్ లన్ని Expiry అయిపోతాయి.

మొదట Buyer వైపు నుండి చూద్దాం.

ఇప్పుడు రమేష్ అనే వ్యక్తికి గురువారం Expiry అయ్యే టైం కి Nifty 14900 దాటుతుందని భావించాడు అనుకుందాం. అప్పుడు అతను Nifty 14900 CE ని Buy చేస్తాడు. దానికోసం అతను14900 కాంట్రాక్ట్ ప్రైస్ 1.45 గా ఉంది.(14900 CE లో LTP లో చుడండి.) Nifty ఒక Lot 50 కాబట్టి 50 X 1.45 = 72.5 రూపాయల ప్రీమియం ని Seller కి చెల్లిస్తాడు.

ఒకవేళ తాను అనుకున్నట్టు Expiry అయ్యే టైం Nifty 14900 దాటితే అతనికి లాభం వస్తుంది. ఒకవేళ దాటకుండా nifty 14850 దగ్గరక్లోజ్ అయింది అనుకుందాం. అప్పుడు తాను కొన్న 14900 కాంట్రాక్ట్ OTM (Out of the Money) లోకి వెళ్తుంది కాబట్టి. దాని విలువ జీరో అయిపోతుంది. కాబట్టి అతనికి లాస్ వస్తుంది.

ఒకవేళ Nifty కనుక 14900 ని దాటి 15000, 15100 ఇలా పెరిగిపోతే అప్పుడు తాను కొన్న 14900 కాంట్రాక్ట్ ప్రైస్ కూడా 1.45 నుండి 5,6,7, ఇలా పెరిగిపోతూ ఉంటుంది. Expiry అయ్యే టైం ఎంత పెరిగితే అంత ప్రాఫిట్ వస్తుంది.

ఇప్పుడు Seller వైపు నుండి చూద్దాం.

సురేష్ అనే వ్యక్తి గురువారం Expiry అయ్యే టైం కి Nifty 14900 దాటదు అని భావించి 14900 CE కాంట్రాక్ట్ ని రమేష్ కి Sell చేసాడు. అందుకు గాను ముందుగానే రమేష్ నుండి 72.5 రూపాయల ప్రీమియం ని తీసుకున్నాడు. ఒకవేళ సురేష్ భావించినట్టే Expiry అయ్యే టైం కి Nifty 14900 ని దాటకపోతే రమేష్ దగ్గర నుండి ఏదైతే ప్రీమియం తీసుకున్నాడో అది తనకి ప్రాఫిట్ అవుతుంది. కానీ ఒకవేళ Nifty 14900 ని దాటి 15000, 15100 ఇలా పెరిగిపోతే అప్పుడు తాను 1.45 దగ్గర Sell చేసిన 14900 కాంట్రాక్ట్ ప్రైస్ కూడా పెరిగిపోతుంది కాబట్టి Expiry అయ్యే టైం ఎంత అయితే పెరిగిందో అంత అమౌంట్ ని తాను రమేష్ కి చెల్లించవలసి ఉంటుంది.

అయితే Options లో జాగ్రత్తగా గమనిస్తే Loss వస్తే Limited గా వస్తుంది. ఏదైతే తాను ఆప్షన్ కాంట్రాక్ట్ ని కొనడానికి ప్రీమియం seller కి చెల్లించాడో అది మాత్రమే కోల్పోతాడు. కానీ ప్రాఫిట్ వస్తే Unlimited గా వస్తుంది.

పై ఉదాహరణే చుస్తే రమేష్ 72.5 రూపాయల ప్రీమియం ని seller కి చెల్లించి 14900 ఆప్షన్ కాంటాక్ట్ ని కొన్నాడు. ఒకవేళ Nifty 14900 ని దాటకపోతే ఆ 72.5 రూపాయల ప్రీమియం మాత్రమే కోల్పోతాడు. ఒకవేళ Nifty 14900 దాటితే అది ఎంత పెరిగితే అంత Profit వస్తుంది. దానికి లిమిట్ ఏమి ఉండదు.

అలాగే Seller కి చుస్తే ప్రాఫిట్ వస్తే Limited గా వస్తుంది. Loss మాత్రం Unlimited గా ఉంటుంది.

ఎందుకంటే తాను రమేష్ దగ్గర 72.5 రూపాయల ప్రీమియం తీసుకుని 14900 ఆప్షన్ కాంటాక్ట్ ని అమ్మాడు. ఒకవేళ Nifty 14900 దాటకపోతే తనకి ఏదైనా రమేష్ దగ్గర నుండి తీసుకున్న ప్రీమియం ఉందొ అది మాత్రమే ప్రాఫిట్ అవుతుంది. ఒకేవేళ Nifty కనుక 14900 దాటి ఎంత పెరిగితే అంత రమేష్ కి చెల్లించాలి. Nifty ఎంత పెరుగుతుందో చెప్పలేం కాబట్టి Loss Unlimited గా ఉంటుంది.

ఇప్పటి వరకు Calls గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు Puts చూద్దాం. ఇది కాల్స్ కి వ్యతిరేకంగా ఉంటుంది.

ఇప్పుడు Nifty 14700 దగ్గర ఉంది కదా ఒకవేళ Nifty 14500 కన్నా కిందకి వెళ్తుంది అనుకుంటే 14500 PE ఆప్షన్ కొంటాడు. దాని ప్రైస్ 14.95 ఉంది కాబట్టి 14.95 X 50 = 747.5 రూపాయలు Seller కి చెల్లిస్తాడు.

ఒకవేళ Nifty 14500 దాటి కిందకి వెళ్లే కొద్దీ Buyer కి ప్రాఫిట్ వస్తుంది. కానీ ఒకవేళ 14500 పైన ఉంటే 14500 PE కాంట్రాక్ట్ OTM (Out of the Money) లోకి వెళ్తుంది కాబట్టి. దాని విలువ జీరో అయిపోతుంది. కాబట్టి అతనికి లాస్ వస్తుంది.

అలాగే సెల్లర్ వైపు నుండి చూస్తే 14500 PE Option Sell చేసాడు కాబట్టి. Nifty 14500 కి పైనే ఉంటే 747.5 ప్రాఫిట్ అవుతుంది. ఒకవేళ Nifty 14500 కి దాటి ఎంత కిందకు వెళ్తే అంత లాస్ వస్తుంది.


ఇప్పుడు మీకు Options గురించి పూర్తి అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. మొదట కొంచెం Confusing గానే ఉండవచ్చు.

ఒకేవేళ మీరు మరింత సులువుగా options గురించి తెలుసుకోవాలి అనుకుంటే Stock Market Guide Telugu ఛానల్ లో అప్లోడ్ చేసిన Option Series ని చూడండి. మరింత సులువుగా అర్ధం అవుతుంది. ఆ వీడియోస్ ని చూడడానికి ఈ లింక్ మీద క్లిక్ చెయ్యండి.

Click Here >> Option Series in Telugu

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *