Options అంటే ఏమిటి? Options Explained in Telugu – Stock Market Telugu

Options అంటే ఏమిటి? What are Options in Stock Market?

Options అంటే ఏంటో తెలుసుకునే ముందు మనం Derivatives అంటే ఏంటో తెలుసుకోవాలి . Derivative అనేది Buyer కి మరియు seller కి మధ్య ఉండే ఒక కాంట్రాక్ట్ దీని విలువ underlying asset మీద ఆధారపడి ఉంటుంది.

ఈ Derivatives లో నాలుగు రకాలు ఉంటాయి. Futures, Options, Forwards, and Swaps.

వీటిలో Futures మరియు Options అనేవి ముఖ్యమైనవి.

ఇప్పుడు మనం Options గురించి తెలుసుకుందాం.

Option అనేది buyer కి seller కి మధ్యలో ఏర్పడిన ఒక Contract (ఒప్పందం). ఈ Contract కొనేవారిని Option Buyer అని , Contract ని అమ్మేవారిని Option Seller లేదా Option Writer అని అంటారు

సాధారణంగా ఈ options ని రిస్క్ ని తగ్గించుకోవడానికి, Hedging కోసం ఉపయోగిస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న Portfolio కి వచ్చే రిస్క్ ని మేనేజ్ చేయడానికి ఈ Futures & Options ఉపయోగిస్తారు.

Options లో రెండు రకాలు ఉంటాయి

1. Call Option (CE)

2. Put Option (PE)

అలాగే Call Option (CE) కొనేవారు, అమ్మేవారు ఉంటారు. అదేవిధంగా Put Option (PE) ని కొనేవారు, అమ్మేవారు ఉంటారు. ఇలా మొత్తం నాలుగు విధాలుగా ఉంటుంది. అయితే ఎవరు, ఎందుకు, ఏ ఉద్దేశ్యంతో ఒక ఆప్షన్ ని కొనడం లేదా అమ్మడం చేస్తారో చుద్దాం.

1. ఒక షేర్ ఇప్పుడు ఉన్న చోట నుండి పెరుగుతుంది అంటే మన View Bullish గా ఉన్నపుడు Call Option (CE) Buy చెయ్యాలి.

2. ఒక షేర్ ఇప్పుడు ఉన్న చోట నుండి పడుతుంది లేదా అక్కడే ఉంటుంది అనుకున్నపుడు అంటే మన View Flat or Bearish గా ఉన్నపుడు Call Option (CE) Sell చెయ్యాలి.

3. ఒక షేర్ ఇప్పుడు ఉన్న చోట నుండి పడుతుంది అంటే మన View Bearish గా ఉన్నపుడు Put Option (PE) Buy చెయ్యాలి.

4. ఒక షేర్ ఇప్పుడు ఉన్న చోట నుండి పెరుగుతుంది లేదా అక్కడే ఉంటుంది అనుకున్నపుడు అంటే మన View Flat or Bullish గా ఉన్నపుడు Put Option (PE) Sell చెయ్యాలి.

ఇది అర్ధం కావడానికి కొంత సమయం పట్టవచ్చు. క్రింద ఉన్న ఫోటోని చుస్తే కొంచెం ఈజీ గా అర్ధం అవ్వవచ్చు.

ఈ Call & Put Options ని కొనడం లేదా అమ్మడం ద్వారా మనం కొన్ని స్ట్రాటజీ లను క్రియేట్ చేయవచ్చు. వీటిని Option Strategies అని అంటారు. Options లో successful గా ట్రేడింగ్ చేయడానికి ఈ స్ట్రాటజీ లు చాలా బాగా ఉపయోగపడతాయి. వాటి గురించి తరువాతి ఆర్టికల్స్ లో తెలుసుకుందాం.

Click Here >> Option Series in Telugu

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *