Stock Market Timings in India (Telugu) – స్టాక్ మార్కెట్ టైమింగ్స్

Stock Market Timings in India:

సాధారణంగా  Stock Market ప్రతిరోజు ఉదయం 9.15 a.m నుండి మధ్యాహ్నం 3.30 p.m వరకు మాత్రమే ఓపెన్ లో ఉంటాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ దానికి ముందు తరువాత కూడా స్టాక్ మార్కెట్  కొంత సేపు ఓపెన్ లో ఉంటుంది. ఆ సమయంలో స్టాక్ మార్కెట్ లో ఏం జరుగుతుందో, అసలు స్టాక్ మార్కెట్ లో టైమింగ్స్ ఎన్ని విధాలుగా ఉంటుందో వివరంగా తెలుసుకుందాం.


ఇండియా లోని స్టాక్ మార్కెట్ టైమింగ్స్ (Stock Market Timings) ని మూడు భాగాలుగా విభజించారు :

1. Pre-opening session (9.00 a.m. – 9.15 a.m)

2. Normal session (9.15 a.m. – 3.30 p.m)

3. Closing session (3.30 p.m. – 4.00 p.m)

ఇప్పుడు ఈ ఒక్కొక్క టైం పీరియడ్ గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.

1. Pre-opening session: ఈ session ఉదయం 9 గంటల నుండి 9 గంటల 15 నిమిషాల వరకు ఉంటుంది. అయితే ఈ Pre-opening session ని మరలా మూడు భాగాలుగా విభజించారు.

Section 1: From 09:00 AM to 09:08 AM:

ఇది 9.00 a.m. నుండి 9.08 a.m వరకు అంటే ఎనిమిది నిమిషాల పాటు ఈ session ఉంటుంది. ఈ ఎనిమిది నిమిషాల్లో మనం ఆర్డర్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే ఈ టైం లో ప్లేస్ చేసిన ఆర్డర్స్ ని మార్చుకోవచ్చు లేదా cancel చేసుకోవచ్చు. ఈ ఆర్డర్స్ అన్ని కూడా మార్కెట్ ఓపెన్ అయిన తరువాత మాత్రమే excute అవుతాయి. దీనిలో సమయంలో సెన్సెక్స్ మరియు Nifty 50 లో ఉండే స్టాక్స్ మాత్రమే ఓపెన్ అవుతాయి.

Section 2: From 09:08 AM to 09:12 AM:

ఇది 9.08 a.m నుండి 09:12 a.m వరకు అంటే 4 నిమిషాల పాటు ఉంటుంది. ఈ టైం లో కొత్తగా ఆర్డర్ ప్లేస్ చేయలేము. అలాగే మనం ఇంతకు ముందు పెట్టిన ఆర్డర్స్ Modify చేయడం గాని, Cancel చేయడం గాని అవ్వదు. ఈ సమయంలో కేవలం Order Matching జరుగుతుంది అంటే ఇంతకు ముందు ఏవైతే ఆర్డర్ ప్లేస్ అయ్యాయో అవన్నీ కూడా మ్యాచ్ చెయ్యబడి, మ్యాచ్ అయిన ఆర్డర్స్ అన్ని కూడా execute అవుతాయి.

Section 3: From 09:12 AM to 09:15 AM:

ఇది 9.12 a.m. నుండి 9.15 a.m వరకు అంటే 3 నిమిషాల పాటు ఉంటుంది. దీనిని Buffer period అని కూడా అంటారు. ఈ టైం లో ఏ ఆర్డర్ లు తీసుకోబడవు, execute కూడా అవ్వవు. సింపుల్ గా చెప్పాలంటే స్టాక్ మార్కెట్ రెస్ట్ లో ఉంటుంది. 9.15 a.m కి ఓపెన్ అవ్వబోయే మార్కెట్ లో ట్రేడింగ్ session స్మూత్ గా ఓపెన్ అవ్వడానికి ఇది ఉపయోగపడుతుంది.

ఈ మూడు నిమిషాల సమయం Pre-opening session కి Normal session మధ్య ఒక కనెక్షన్ లా ఉంటుంది అంతే తప్ప దీనిలో ఎటువంటి ట్రేడింగ్ ఆక్టివిటీ జరగదు.


2.Normal Session (9.15 a.m. to 3.30 p.m.)

ఇది మన అందరికి తెలిసిందే. ఉదయం 9.15 నుండి మధ్యాహ్నం 3.30 వరకు ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. ఈ సమయలో bilateral order matching system ద్వారా ఆర్డర్ ప్లేస్ అవుతాయి. అంటే Buy Price మరియు Sell Price రెండు సమానం అయినపుడు ఆర్డర్ execute అవుతుంది. చివరగా 3 గంటల 30 నిమిషాలకి మార్కెట్ క్లోజ్ అయిపోతుంది అని చాలా మంది అనుకుంటారు. కానీ ఆ తరువాత కూడా మార్కెట్ కొంత సేపు ఉంటుంది.


3.Post-closing Session: (3.30 p.m. -4 p.m.)

ఇది అరగంట పాటు ఉంటుంది. అయితే ఈ Post-closing Session ని కూడా మరలా రెండు రకాలుగా విభజించారు.

Section 1: From 03:30 PM to 03:40 PM

ఈ Session 10 నిమిషాల పాటు ఉంటుంది. ఈ టైం లో ఎటువంటి ఆర్డర్ లు తీసుకోబడవు కానీ ఈ సమయంలో ప్రతి స్టాక్ యొక్క Closing Price అనేది నిర్ణయించబడుతుంది . చివరి అరగంట అంటే 3 p.m. – 3.30 p.m. వరకు మధ్యలో జరిగిన ట్రేడింగ్ యొక్క Volume Weighted Average of Prices ఆధారంగా Closing price ని లెక్కిస్తారు.

Section 2: From 03:40 PM to 04:00 PM

ఈ Session 20 నిమిషాల పాటు ఉంటుంది. ఈ టైం లో కూడా మనం కావాలంటే ఆర్డర్స్ ని ప్లేస్ చేసుకోవచ్చు. కానీ అవన్నీ కూడా కేవలం మార్కెట్ ఆర్డర్ అంటే ఏదైతే క్లోసింగ్ ప్రైస్ నిర్ణయించబడిందో ఆ ప్రైస్ దగ్గర మాత్రమే execute అవుతాయి. అది కూడా కావలిసినంత మంది Buyers & Sellers ఉన్నపుడు మాత్రమే. ఇక్కడితో Equity Market క్లోజ్ అవుతుంది.

ఈ విధంగా మన ఇండియాలోని స్టాక్ మార్కెట్ టైమింగ్స్ ని నిర్ణయించడం జరిగింది.

By admin

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *