స్టాక్ మార్కెట్ లో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన కొన్ని పదాలు Basic Stock Market Terms in Telugu – Stock Market Telugu

Stock Market Basic Jargons Every Investor Must Know:


కొత్తగా స్టాక్ మార్కెట్ లోకి వచ్చిన వారికి స్టాక్ మార్కెట్ (Stock Market) కి సంబందించిన కొన్ని పదాలు కొత్తగా ఉంటాయి. అర్ధం కావు. కానీ వీటి గురించి తెలుసుకోవడం చాలా అవసరం అలాంటి వారందరి కోసం ఈ A-Z పేజీ చాలా బాగా ఉపయోగపడుతుంది. దీనిలో స్టాక్ మార్కెట్ సంబందించిన చాలా పదాలకు అర్ధం ఏమిటో వివరించడం జరిగింది. వాటిని A నుండి Z వరకు ఒక వరుస క్రమంలో ఇవ్వడం జరిగింది. ఈ A-Z పేజ్ ఒక స్టాక్ మార్కెట్ డిక్షనరీ లా ఉపయోగపడుతుంది.

ఈ పేజీ లో ఎప్పటికప్పుడు కొత్త పదాలను చేర్చుతూ ఉంటాం. ఆ పదాలను చేర్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడానికి స్టాక్ మార్కెట్ తెలుగు వెబ్ సైట్ కి సబ్స్క్రయిబ్ చేసుకోండి.

A;
Ask Price:
Sellers ఏ ప్రైస్ దగ్గర Sell చెయ్యడానికి రెడీ గా ఉన్నారో ఆ Price ని Ask Price అని అంటారు

Arbitrage:
ఒకే కంపెనీ కి సంబందించిన షేర్ ని వేరు వేరు మార్కెట్ లలో ఒక ప్రైస్ ల దగ్గర కొని, వేరొక ప్రైస్ దగ్గర అమ్మడాన్ని Arbitrage అంటారు. మనం గమనిస్తే ఒక కంపెనీ షేర్ BSE లో ఒక ప్రైస్ , NSE లో ఒక ప్రైస్ తో ట్రేడ్ అవుతూ ఉంటుంది.
కొన్ని కొన్ని కారణాల వలన ఇలా ఒకే కంపెనీ షేర్ ఒక్కొక మార్కెట్ లో ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది. వీటి మధ్య చాలా చిన్న వత్యాసం ఉంటుంది. అలాంటప్పుడు కొంతమంది ఒక మార్కెట్ లో తక్కువ ధరకు ఆ షేర్ ని కొని వేరొక మార్కెట్ లో ఎక్కువ ధరకు అమ్ముకుంటారు.

All time high:

ఒక కంపెనీ స్టాక్ ఎక్స్చేంజి(Stock Exchange) లో లిస్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఏ అత్యధిక ధర (High Price) వరకు చేరుకుందో దానిని All time high అని అంటారు.

All time low:

ఒక కంపెనీ స్టాక్ ఎక్స్చేంజి లో లిస్ట్ అయినప్పటి నుండి ఇప్పటివరకు ఏ అత్యల్ప ధర (Low Price) వరకు చేరుకుందో దానిని All time low అని అంటారు.

B:
Bull market:

(Stock Market) స్టాక్ మార్కెట్ గమనాన్ని సూచించే సూచీలు అయినటువంటి సెన్సెక్స్ (Sensex) మరియు (Nifty)నిఫ్టీ లు వరుసగా లాభాల్లో కదులుతుంటే దానిని బుల్ మార్కెట్ అంటారు. ఈ బుల్ మార్కెట్ సమయంలో ఇన్వెస్టర్ లు స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తాయని నమ్మకంతో, ఆశావాద దృక్పధం తో పెట్టుబడి దారులందరు ఎక్కువగా షేర్లు కొనడానికి మొగ్గు చూపుతుంటారు. బుల్ మార్కెట్(Bull Market) లో దాదాపు అన్ని కంపెనీల షేర్ల ధరలు పెరుగుతూ ఉంటాయి.

Bear market:
సెన్సెక్స్ (Sensex) మరియు నిఫ్టీ (Nifty) లు వరుసగా నష్టాల్లో కదులుతున్నట్లైతే దానిని బేర్ మార్కెట్ అని అంటారు . ఈ సమయంలో దాదాపు అన్ని కంపెనీల షేర్ల ధరలు కూడా పడిపోతూ ఉంటాయి. పెట్టుబడి దారులందరు భయంతో షేర్లు అమ్మడానికి మొగ్గు చూపుతారు. స్టాక్ మార్కెట్ అంతా ఒక వ్యతిరేకధోరణిలో , నష్టాల్లో , భయాందోళనలో ఉంటాయి.

Bid Price:
Buyers ఏ ప్రైస్ దగ్గర షేర్లను కొనడానికి రెడీ గా ఉన్నారో ఆ ప్రైస్ ని Bid Price అని అంటారు.

Bonds:
బాండ్స్ అనేవి fixed income ని ఇచ్చే instrument అని చెప్పవచ్చు. సాధారణంగా ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీ లు వాటికి ఫండ్స్ కావలసినప్పుడు ఈ బాండ్స్ ని రిలీజ్ చేస్తాయి. అంటే ఈ బాండ్స్ ని కొనుక్కున్న వారు, ఎవరైతే బాండ్స్ ని రిలీజ్ చేసారో వాళ్ళకి డబ్బుని అప్పుగా ఇచ్చినట్టు. అందుకుగాను బాండ్స్ రిలీజ్ చేసిన ప్రభుత్వాలు, కార్పొరేట్ కంపెనీ లు కొంత ఇంట్రెస్ట్ (వడ్డీ) ని చెల్లిస్తారు. వీటికి maturity టైం ఉంటుంది. ఆ టైం కంప్లీట్ అవ్వగానే ఏదైతే డబ్బు (Principal Amount) ని బాండ్స్ ని కొనడానికి ఉపయోగించామో అది వెనక్కి వచ్చేస్తుంది.

Broker:
బ్రోకర్ లేదా బ్రోకరేజ్ కంపెనీ లు ఒక ఇన్వెస్టర్ కి స్టాక్ మార్కెట్ కి మధ్యలో మధ్యవర్తి గా ఉంటాయి. మనలాంటి ఇన్వెస్టర్స్ తరుపున స్టాక్ ఎక్స్ఛేంజ్లో షేర్ లు కొనడం మరియు అమ్మడం చేసే అధికారం ఈ బ్రోకర్ కి ఉంటుంది.

Ex: Zerodha, Upstox, Angel One, ICICI Direct etc.

C:
Close Price:

ఒక టైం పీరియడ్ లో ఒక షేర్ ఏ ప్రైస్ దగ్గర అయితే క్లోజ్ అయిందో దానిని క్లోజ్ ప్రైస్ అంటారు.

D:
Day order:

ఒక ఆర్డర్ ని ప్లేస్ చేసినప్పుడు అది ఆ ట్రేడింగ్ డే ముగిసే వరకు మాత్రమే ఓపెన్ లో ఉండే ఆర్డర్ ని day order అని అంటారు. మార్కెట్ ముగిసే సమయానికి ఆ ఆర్డర్ execute కాకపోతే, అది రద్దు చేయబడుతుంది.

Dividends:
(Dividend)డివిడెండ్: ఏదైనా ఒక కంపెనీ తనకు వచ్చిన లాభల్లో కొంత భాగాన్ని ఆ కంపెనీ లో షేర్లు కలిగినటువంటి షేర్ హోల్డర్స్ (Share Holders) కి పంచుతుంది. వాటిని డివిడెండ్ (Dividend) అని అంటారు.
సాధారణంగా ఈ డివిడెండ్స్ ని సంవత్సరానికి ఒకసారి గాని లేదా ఆరు లేదా మూడు నెలలకు ఒకసారి గాని ప్రకటిస్తాయి . ప్రతి మూడు నెలలకు ఒకసారి అన్ని కంపెనీ లు తమ త్రైమాసిక ఫలితాలను(Quarterly Results) ప్రకటిస్తూ ఉంటాయి. ఆ సమయంలోనే డివిడెండ్ ఇస్తున్నాయా లేదా ఇస్తే ఎంత శాతం డివిడెండ్ ఇస్తున్నాయి వంటి వివరాలు ప్రకటిస్తాయి.

Demat Account
డీమ్యాట్ అకౌంట్ (Demat Account): మనం డబ్బుని బ్యాంకు లో ఎలా దాచుకుంటామో, అలాగే మనం కొన్న షేర్లను దాచుకునే అకౌంట్ నే డీమ్యాట్ అకౌంట్ అని అంటారు. దీనిలో మన షేర్ లన్ని కూడా ఎలక్ట్రానిక్ రూపంలో భద్రపరచబడి ఉంటాయి. ఈ అకౌంట్ లో మన షేర్ లు మాత్రమే కాదు బాండ్ లు, మ్యూచువల్ ఫండ్స్, గవర్మెంట్ సెక్యూరిటీస్ అన్ని భద్రపరచుకోవచ్చు.

E:

Execution:
మనం ఏదైనా షేర్ ని కొనడానికి లేదా అమ్మడానికి ఒక ఆర్డర్ ని ప్లేస్ చేసినప్పుడు ఆ ఆర్డర్ కనుక ఫిల్ అయితే అంటే కంప్లీట్ అయితే అప్పుడు ఆ ఆర్డర్ Execute అయ్యింది అని అంటారు. అంటే కేవలం మనం ఆర్డర్ ని ప్లేస్ చేస్తే కాదు, కంప్లీట్ అయితే అయితేనే అది Execute అయినట్టు.

Exchange:
స్టాక్ మార్కెట్ లో ఎక్కడైతే షేర్ లు కొనడానికి, అమ్మడానికి వీలుగా లిస్ట్ అయ్యి ఉంటాయో దానిని ఎక్స్చేంజి అని అంటారు. మన దేశంలో ముఖ్యంగా రెండు ఎక్స్చేంజి లు ఉన్నాయి. 1.NSE(National Stock Exchange) 2.BSE (Bombay Stock Exchange)

F:
Face value:
Face Value అంటే ఒరిజినల్ వేల్యూ అని అర్ధం.

ఒక కంపెనీ మొదటి సారిగా Stock Market లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఒక షేర్ యొక్క ఒరిజినల్ ప్రైస్ ఎంత అనేది నిర్ణయిస్తుంది. దానిని Face Value అని అంటారు. అలాగే ఇష్యూ ప్రైస్ ని కూడా అనౌన్స్ చేస్తుంది . అంటే Face Value కి కొంత ప్రీమియం ఆడ్ చేసి ఇష్యూ ప్రైస్ ని నిర్ణయిస్తారు.

ఉదాహారానికి ఒక కంపెనీ పేస్ వేల్యూ అనేది 10 అనుకుందాం. మార్కెట్ లో ట్రేడ్ అవుతున్న దాని షేర్ ప్రైస్ 500 ఉంది అనుకుంటే. మనం ఆ షేర్ ని కొనాలంటే పేస్ వేల్యూ 10 ఉంది కదా దానికి 490 రూపాయలు ఎక్స్ట్రా ప్రీమియం చెల్లించి కొంటున్నాం అని అర్ధం.

స్టాక్ మార్కెట్ లో Share Value అనేది ఆ కంపెనీ Performance ని బట్టి, Supply & Demand ని బట్టి మారుతూ ఉంటుంది. కానీ Face Value అనేది మారదు. కానీ ఎప్పుడైనా కంపెనీ షేర్ Split చేసినప్పుడు మాత్రం ఈ Face Value మారుతూ ఉంటుంది.

ఒక కంపెనీ ఈ Face Value ని ఆధారంగా చేసుకుని Stock Split మరియు Dividend ని ప్రకటిస్తూ ఉంటుంది.

Futures:

ఫ్యూచర్స్ అనేది ఒక Buyer కి Seller కి మధ్య భవిష్యత్తులో నిర్ణీత సమయంలో ఏదైనా ముందుగా నిర్ణయించిన ధర వద్ద ఏదైనా ఒక వస్తువుని కొనడానికి లేదా అమ్మడానికి జరిగిన చట్టపరమైన ఒప్పందం( agreement). ప్రతి ఫ్యూచర్ కాంట్రాక్టు కి కూడా ఒక ఎక్సపీరి డేట్ అనేది ఉంటుంది.
దీని గురించి పూర్తిగా తెలియాలనే ఈ వీడియో ని చుడండి. Click Here

H:
High Price:
ఒక టైం పీరియడ్ లో ఒక షేర్ ఎంత High ప్రైస్ కి చేరుకుందో అంటే Highest Price ఏదైతే ఉందో దానిని High Price అని అంటారు.

I:
IPO … Initial Public Offering. అంటే ఏదైనా ఒక కంపెనీ మొట్టమొదటిసారి తమ షేర్లను ప్రజలకు అమ్మడాన్ని IPO అంటారు. సాధారణంగా ఏదైనా కంపెనీ మరింత విస్తరించాలనుకున్న .లేక తనకు ఉన్న అప్పులను తీర్చాలన్నా . లేదా మరొక చోట ఒక కొత్త ప్లాంట్ ని నిర్మించాలన్నా కొంత మూలధనం అవసరం అవుతుంది. ఆ డబ్బుని ప్రజల దగ్గరనుండి సేకరించడం కోసం ఆ కంపెనీ తమ కంపెనీ షేర్లను ప్రజలకు అమ్ముతుంది.

అయితే అంతకన్నా ముందు షేర్లను అమ్మడానికి కంపెనీ (SEBI)సెబీకి దరఖాస్తు చేసుకోవాలి. సెబీ నుండి అనుమతి లభించిన తరువాత కంపెనీ IPO కి వస్తుంది. అలాగే కంపెనీ తన షేర్లను ఇన్వెస్టర్స్ కి ఏ ధరకి అమ్మాలనుకుంటుంది , అసలు IPO ద్వారా ఎంత సొమ్ము సేకరించబోతుంది, ఎన్ని షేర్లను అమ్మాలనుకుంటుంది, ఏ సమయంలో IPO కి రాబోతుంది వంటి వివరాలన్నీ విడుదల చేస్తుంది. ఈ IPO లో మీ సాధారణంగా షేర్లను కొన్నట్టు కాకుండా మీరు షేర్ల కోసం దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది . అయినా సరే మీకు ఆ షేర్లు దక్కుతాయని హామీ లేదు . ఎందుకంటే కంపెనీ అమ్మాలనుకున్న షేర్ల సంఖ్యకంటే ఎక్కువమంది షేర్ల కోసం దరఖాస్తు చేసుకుంటే , వారిలో కొంతమందికి మాత్రమే ఆ షేర్లు దక్కుతాయి. ఒకవేళ మీకు షేర్లు కనుక లభించకపోతే మీ డబ్బుతిరిగి వాపసు అందుతుంది.

Index:
ఇండెక్స్ అనేది స్టాక్ మార్కెట్లు ఏవిధంగా ఉన్నాయో సూచించే ఒక సూచి. అంటే ఈ రోజు స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయా లేక నష్టాల్లో ఉన్నాయా అనేది ఈ ఇండెక్స్ ద్వారా తెలుస్తుంది. మన దేశంలో ముఖ్యంగా రెండు ఇండెక్స్ లు ఉన్నాయి. 1. Sensex 2.Nifty

Intra-day trading:
Intraday: దీనినే డే ట్రేడింగ్ (Day Trading) అని కూడా అంటారు.
ఒక రోజు షేర్ లు కొని, అదే రోజు అమ్మినట్లైతే దానిని Intraday అని అంటారు. Intraday లో ఉదయం మన షేర్ లు కొన్న లేదా షార్ట్ సెల్లింగ్ కోసం అమ్మినా .. ఆ రోజు మార్కెట్ లు క్లోజ్ అయ్యేలోపు ఓపెన్ లో ఉన్న positions ని క్లోజ్ చేయవలసి ఉంటుంది.

Inflation:
ద్ర‌వ్యోల్బ‌ణం అంటే మనం రోజువారి వాడే వస్తువుల లేదా సేవల ధరలు పెరిగే రేటును ద్ర‌వ్యోల్బ‌ణం అని అంటారు. ఈ ద్ర‌వ్యోల్బ‌ణాన్ని సాధారణంగా % శాతాలలో కొలుస్తారు. వస్తువుల డిమాండ్ పెరిగిపోవడం, సప్లై దగ్గడం వలన ఈ వస్తువుల ధరలు అనేవి పెరిగిపోతాయి. అదే ఈ inflation కి కారణం.

Limit order:
Limit order ద్వారా మన ఏదైనా ఒక షేర్ ని మనకే కావలసిన ధర వద్ద అమ్మడం లేదా కొనడం చేయవచ్చు. Limit order ని ప్లేస్ చేసినప్పుడు మనం ఏదైతే ప్రైస్ ని ఇస్తామో సరిగ్గా ఆ ప్రైస్ కి వచ్చినప్పుడు మాత్రమే ఆ ఆర్డర్ execute అవుతుంది.

Liquidity:
మనం ఏ సమయంలో అయినా ఎంత సులభంగా మనకు కావలసినన్ని షేర్లను కొనగలుగుతున్నాం అమ్మగలుగుతున్నాం అని తెలిపే దానిని లిక్విడిటీ (Liquidity) అని అంటారు . లిక్విడిటీ ఉన్న షేర్లను మనం అమ్మాలనుకున్న లేదా కొనాలనుకున్న అటువైపు buyers లేదా సెల్లెర్స్ ఎక్కువ అందుబాటులో ఉంటారు కాబట్టి సులభంగా షేర్లను కొనడం అమ్మడం చెయ్యవచు.

Large-cap stock
ఏ కంపెనీ Market capitalization అయితే 20 వేల కోట్ల కన్నా ఎక్కువగా ఉంటుందో వాటిని Large Cap కంపెనీ అని అంటారు. ఈ కంపెనీలకు ఆయా రంగాలలో మంచి పేరు ఉంటుంది. ఇటువంటి కంపెనీ లో ఇన్వెస్ట్ చేస్తే రిస్క్ తక్కువగా ఉంటుంది.

Low Price:
ఒక టైం పీరియడ్ లో ఒక షేర్ ఎంత Low ప్రైస్ కి చేరుకుందో అంటే Lowest Price ఏదైతే ఉందో దానిని Low Price అని అంటారు.

M:
market order: market order ద్వారా మనం ఆర్డర్ ని ప్లేస్ చేసినపుడు మార్కెట్ లో ఏ ప్రైస్ లో అయితే ట్రేడ్ అవుతుందో సరిగ్గా ఆ ప్రైస్ కి వెంటనే ఆర్డర్ execute అవుతుంది.

Market capitalization:
ఒక కంపెనీ యొక్క మొత్తం విలువని Market capitalization అని అంటారు. ఒక కంపెనీ Share Price x ఆ కంపెనీ కి కి ఉన్న మొత్తం షేర్లను గుణిస్తే ఆ కంపెనీ Market capitalization వస్తుంది.

ఉదాహరణకి ఒక కంపెనీ కి 10000 షేర్లు ఉన్నాయి అనుకుందాం. అలాగే ఒక్కొక్క షేర్ ధర 100 అనుకుంటే ఆ కంపెనీ మొత్తం Market capitalization 10 లక్షలు అవుతుంది.

Mutual Funds:
మ్యూచువల్ ఫండ్ అంటే ఒకే ఆర్థిక లక్ష్యం కలిగినటువంటి కొంతమంది పెట్టుబడిదారుల నుండి డబ్బుని సేకరించడం కోసం ఏర్పడిన ఒక ట్రస్ట్. ఇక్కడ పెట్టుబడిదారులందరి లక్ష్యం ఏమిటి? డబ్బుని పెట్టుబడిగా పెట్టడం దాని నుండి లాభాలు పొందడం. ఇలాంటి పెట్టుబడిదారులందరి నుండి మ్యూచువల్ ఫండ్ కంపెనీ డబ్బుని సేకరిస్తుంది. ఈ మొత్తం మ్యూచువల్ ఫండ్ కి మార్కెట్ మీద మంచి నైపుణ్యం ఉన్నటువంటి కొంతమంది ఫండ్ మేనేజర్స్ గా ఉంటారు. ఈ ఫండ్ మేనేజర్స్ ఇలా పెట్టుబడిదారులందరి నుండి సేకరించిన డబ్బుని స్టాక్స్ (Stocks), గోల్డ్(Gold), బాండ్స్(Bonds), డిబెంచర్స్(Debenture) డెట్ పథకాలు(Debt) వంటి వివిధరకాల పెట్టుబడి సాధనలలో ఇన్వెస్ట్(Invest) చేస్తారు. దాని ద్వారా వచ్చిన లాభాలను ఆ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లందరికీ వాళ్ళు పెట్టిన పెట్టుబడి ఆధారంగా పంచడం జరుగుతుంది.

Margin:

ట్రేడింగ్ చేసేవారు మరిన్ని ఎక్కవ షేర్ లు కొనడానికి స్టాక్ బ్రోకర్ ల నుండి కొంత అమౌంట్ అప్పుగా తీసుకుంటారు. దానిని Margin అని అంటారు. ఇలా మార్జిన్ తీసుకోవడం వలన మన దగ్గర తక్కువ డబ్బుకి ఎన్ని షేర్ లు అయితే వస్తాయో అంతకన్నా ఎక్కువ షేర్ లు కొనవచ్చు.

Mid-cap stocks
ఏ కంపెనీ Market capitalization అయితే 5000 వేల కోట్ల నుండి 20 వేల కోట్ల మధ్యలో ఉంటుందో వాటిని మిడ్ కాప్ కంపెనీ లు అని అంటారు. వీటిలో కొన్ని స్మాల్ కాప్ కంపెనీలుగా మొదలై మిడ్ కాప్ స్థాయి వరకు చేరుకున్నవి ఉంటాయి. అంతేకాదు ఈ మిడ్ కాప్ కంపెనీస్ కి భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి మంచి అవకాశం కూడా ఉంటుంది.

Nifty:
Nifty అనే పదం National Stock Exchange Fifty అనే పదం నుండి వచ్చింది. ఈ నిఫ్టీ ని . NIFTY 50 అని CNX NIFTY అని కూడా పిలుస్తారు Nifty అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి లో ట్రేడ్ అవుతున్న కంపెనీలలో టాప్ కంపెనీలను తీసుకుని వాటి షేర్ల ధర కదలిక ఆధారంగా ఈ నిఫ్టీ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది .

O:
Open Price: ఒక టైం పీరియడ్ లో ఒక షేర్ ఏ ప్రైస్ దగ్గర అయితే ఓపెన్ అయిందో దానిని ఓపెన్ ప్రైస్ అంటారు.

P:
Portfolio:
మీకు ఉన్న ఫైనాన్సియల్ అసెట్స్ అన్నిటిని కలిపి మీ పోర్ట్ఫోలియో అంటారు. ఉదాహారానికి ఒక వ్యక్తి కొంత స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసాడు ,అలాగే కొంత మ్యూచువల్ ఫండ్స్ లో, బాండ్స్ లో, రియల్ ఎస్టేట్ ఇలా రకరకాల మార్గాల్లో ఇన్వెస్ట్ చేసాడనుకుంటే వీటన్నిటిని కలిపి Portfolio అని అంటారు.

Penny Stocks:
పెన్నీ స్టాక్స్ అంటే తక్కువ షేర్ ప్రైస్ కలిగి ఉండి , అలాగే Market Capitalization కూడా తక్కువగా ఉన్న కంపెనీ కి చెందిన షేర్ల ను Penny Stocks అని అంటారు. పెన్నీ స్టాక్స్ ప్రైస్ 5 పైసల నుండి 10 రూపాయల వరకు ఉంటుంది. Market Capitalization తక్కువగా ఉండడం వలన కొంతమంది ప్రమోటర్లు ఈ షేర్లను వాళ్ళకి కావలిసినట్టుగా పెంచడం, తగ్గించడం చేస్తూ ఉంటారు. కాబట్టి వీటిలో రిస్క్ చాల ఎక్కువగా ఉంటుంది. అయితే రిస్క్ ఎంత ఉంటుందో వస్తే లాభాలు కుడా అలాగే ఉంటాయి.

S:
Stock Split:
Stock Split అంటే ఒక కంపెనీకి తనకి ఉన్న షేర్ల సంఖ్యను పెంచడం కోసం అప్పటికే ఉన్న షేర్లను విభజించడాన్నీ stock split అని అంటారు. దీని వలన షేర్ల సంఖ్య అయితే పెరుగుతుంది కానీ ఆ కంపెనీ యొక్క market capitalization లో ఎటువంటి మార్పు ఉండదు . సాధారణంగా ఈ Stock Split అనేది 2:1 ,3:1లేదా 5:1 ఇలా రేషియో లలో జరుగుతుంది. 2:1 రేషియో లో షేర్ ని విభజించారు అంటే ఆ షేర్లు కలిగి ఉన్న పెట్టుబడిదారులు తమ దగ్గర ఉన్న ఒక్కొక్క షేర్ కి బదులుగా రెండు షేర్లను పొందుతారు. కానీ తమ పెట్టుబడి లో మాత్రం ఎటువంటి మార్పు ఉండదు.

Sensex:
(Sensex) సెన్సెక్స్ అనే అనే పదం Sensitive Index అనే దాని నుండి వచ్చింది సెన్సెక్స్ ని S&P BSE SENSEX లేదా S&P SENSEXఅని కూడా పిలుస్తారు . సెన్సెక్స్ అనేది ఒక రోజులో లేదా ఒక ఫలానా సమయంలో ఇండియా లోని స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఉన్నాయా లేక నష్టాల్లో ఉన్నాయా అనే విషయాన్ని తెలిపే ఒక సూచీ.

బాంబే స్టాక్ ఎక్స్చేంజి లో ట్రేడ్ అవుతున్న కంపెనీలలో టాప్ 30 కంపెనీలను తీసుకుని వాటి షేర్ల ధర కదలిక ఆధారంగా ఈ సెన్సెక్స్ పెరగడం లేదా తగ్గడం జరుగుతుంది.

Short Selling:
సాధారణంగా ఒక షేర్ పెరుగుతున్నప్పుడు తక్కువ ధరలో కొని తరువాత ఎక్కువ ధరలో అమ్మితే మనకు లాభం వస్తుంది. ఇది మన అందరికి తెలిసిందే కానీ ఒక షేర్ పడిపోతున్నపుడు కూడా మనం దాని నుండి డబ్బులు సంపాదించవచ్చు . దీనిని షార్ట్ సెల్లింగ్ అని అంటారు. ఈ పద్దతిని ట్రేడింగ్ లో ఉపయోగిస్తారు.

ఒక షేర్ పడిపోతుంది అని మీకు అనిపించినప్పుడు ముందు ఆ షేర్ ని అమ్మి, ఆ షేర్ బాగా పడిన తరువాత తక్కువ ధరలో కొనుక్కొవకాడం ద్వారా కూడా మనం లాభాలు సంపాదించదవచ్చు. మనం ముందు అమ్మిన ప్రైస్ కి తరువాత కొన్న ప్రైస్ కి మధ్య ఏదైతే వత్యాసం ఉంటుందో అది మనకు ప్రాఫిట్ అవుతుంది.

SEBI:
సెబీ అంటే Securities Exchange Board of India. ఇది స్టాక్ మార్కెట్ లో ఎటువంటి మోసాలు జరగకుండా చూసుకుంటూ, పెట్టుబడిదారుల డబ్బుని కాపాడడం కోసం ఏర్పడిన ఒక సంస్ద. ఇది స్టాక్ మార్కెట్ మొత్తాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఒకవేళ ఏ కంపెనీ అయిన మోసపూరితమైన చర్యలు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షిస్తుంది.

Spread( Ask-Bid Spread) Ask Price కి bid price మధ్య ఉన్న తేడాని Ask-Bid Spread అని అంటారు. అంటే buyers ఏ ప్రైస్ దగ్గర కొనాలనుకుంటున్నారు? ఏ ప్రైస్ దగ్గర అమ్మాలనుకుంటున్నారు ? ఈ రెండు ప్రైస్ మధ్య తేడా ని ఈ Spread

Small Cap Companies:
ఏ కంపెనీ మార్కెట్ కాపిటల్ అనేది తక్కువగా ఉంటుందో అంటే సుమారుగా 5000 కోట్ల కన్నా తక్కువగా ఉంటుందో అటువంటి కంపెనీలను Small cap కంపెనీస్ అని అంటారు. స్టార్ట్ అప్ గా మొదలై డెవలప్మెంట్ స్టేజ్ లో ఉండే కంపెనీ లు ఈ క్యాటగిరీలోకి ఉంటాయి.

Square Off:
Square Off అంటే సింపుల్ గా మీరు మీ దగ్గర ఉన్న పోసిషన్ ని క్లోజ్ చెయ్యడం అని అర్ధం.

ఉదాహారానికి మీరు ఉదయం ITC కంపెనీ లో 100 షేర్స్ కొన్నారు అనుకుందాం. వాటిని తరువాత మీరు Sell చేస్తే దానిని Square Off అని అంటారు. అంటే మీ దగ్గర అప్పటివరకు ఉన్న పోసిషన్ క్లోజ్ అయ్యిపోయింది అని అర్ధం.

ఈ విధంగా మొదట్లో మీరు ప్లేస్ చేసిన ఆర్డర్ అది Buy గాని Sell గాని ఏదైనా సరే తరువాత దానికి Reverse Transaction చెయ్యడం ద్వారా అప్పటి వరకు మీ దగ్గర ఉన్న Open postions ని క్లోజ్ చేయడాన్ని Square Off అని అంటారు.

V:
Volume:
వాల్యూమ్ అంటే ఒక కంపెనీకి సంబందించిన షేర్లు ఒక రోజులో ఎన్ని ట్రేడ్ అయ్యాయో లేదా ఎన్ని షేర్లు చేతులు మారాయో అంటే ఎన్ని షేర్లు అమ్మడం కొనడం జరిగిందో దానిని వాల్యూమ్ (Volume) అని అంటారు. ఉదాహరానికి ఈ రోజు ఐటీసీ కంపెనీ చార్ట్ ని చూసినప్పుడు వాల్యూమ్ 1000000 అని ఉందనుకుందాం . దాని అర్ధం ఆ రోజు 10 లక్షల షేర్లు చేతులు మారాయి అని అర్ధం.

Volatility:
ఒక షేర్ ప్రైస్ ఎక్కువ రేంజ్ లో విపరీతంగా పెరిగిపోవడం లేదా తగ్గిపోవడం జరిగితే దానిని Volatility అని అంటారు. అంటే బాగా తక్కువ సమయంలో ఎక్కువుగా fluctuate అవుతూ ఉంటుంది.

52 week high:

ఏదైనా ఒక షేరు ధర గత 52 వారాల ( ఒక సంవత్సరంలో ) కాలంలో ఏ అత్యధిక ధర వద్ద ట్రేడ్ అయ్యిందో (లేదా ) 52 వారాలలో ఏదైతే అత్యధిక ధరగా ఉంటుందో దానిని 52 week high అని అంటారు.

52 week low:

ఏదైనా ఒక షేరు ధర గత 52 వారాల ( ఒక సంవత్సరంలో ) కాలంలో ఏ అత్యల్ప ధర వద్ద ట్రేడ్ అయ్యిందో (లేదా ) 52 వారాలలో ఏదైతే అతి తక్కువ ధరగా ఉంటుందో దానిని 52 week high అని అంటారు.

By admin

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *