MTF (Margin Trading Facility) అంటే ఏమిటి ? Stock Market Telugu

MTF or Margin Trading Facility or Pay later in Stock Market:

మీరు స్టాక్ మార్కెట్ (Stock Market) లో రీసెర్చ్ చేస్తున్న టైం లో ఉదాహారానికి ABC అనే ఒక కంపెనీ ని findout చేశారనుకుందాం . ఆ స్టాక్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా పెరుగుతుంది అని మీకు నమ్మకం ఉంది. కానీ మీద దగ్గర కాపిటల్ తక్కువగా ఉంది. ఇలా అమౌంట్ తక్కువగా ఉండడం వలన చాలా అవకాశాలు మిస్ అవుతూ ఉంటాం. అలంటి వాళ్ళ కోసమే MTF అనే ఒక ఆప్షన్ ఉంది.

MTF అంటే Margin Trading Facility –

ఈ సర్వీస్ ద్వారా మనం ఏదైనా కంపెనీ షేర్లు కొనడానికి అయ్యే మొత్తం అమౌంట్ లో కేవలం కొంత భాగం మాత్రమే చెల్లించి షేర్లను కొనుక్కోవచ్చు. మిగిలిన అమౌంట్ ని మనం ఏదైతే బ్రోకరేజ్ అకౌంట్ (Stock Brokerage Account) ఉపయోగిస్తామో ఆ బ్రోకరేజ్ కంపెనీలు పే చేస్తాయి. సింపుల్ గా చెప్పాలంటే మనం brokerge కంపెనీ నుండి కొంత డబ్బుని అప్పుగా తీసుకుని ఇన్వెస్ట్ చేతున్నాం అన్నమాట. అలా అప్పుగా తీసుకున్న అమౌంట్ కి మనం కొంత ఇంట్రస్ట్ పే చేయవలసి ఉంటుంది.

ఇది బాగా అర్ధం అవ్వడం కోసం ఒక example చెప్పుకుందాం. ముందు చెప్పుకున్న ABC అనే షేర్ చూద్దాం. ఈ కంపెనీ షేర్ 1000 రూపాయలు ఉంది అనుకుందాం. ఈ కంపెనీ బాగా పెరుగుతుందనిపిస్తుంది. సో మీరు 100 షేర్స్ కొందాం అనుకుంటున్నారు. అందుకుగాను 100000 అవసరం అవుతుంది. కానీ మీ దగ్గర కేవలం 25 వేలు మాత్రమే ఉన్నాయి. సో నార్మల్ గా అయితే మీకు కేవలం 25 షేర్ లు మాత్రమే వస్తాయి.

కానీ మీరు MTF option ఉపయోగించుకుంటే మీ దగ్గర ఉన్న 25000 కి 3 లేదా 4 రెట్లు ఎక్కువ అమౌంట్ మనకి బ్రోకరేజ్ కంపెనీ ఇస్తుంది. మన దగ్గర 25000 ఉన్నాయి కదా దానికి తోడుగా 75000 మనం ఉపయోగిస్తున్న స్టాక్ బ్రోకరేజ్ కంపెనీ ఇస్తుంది. సో మొత్తం 100000 తో ABC కంపెనీ షేర్ లు 100 కొనుకోవచ్చు. అంటే మనం ఒక స్టాక్ కొనే అమౌంట్ తో ల 4 స్టాక్స్ కొనుక్కోవచ్చు .


అయితే మనం (Leverage) లేవరేజ్ రూపంలో బ్రోకరేజ్ కంపెనీ నుండి తీసుకున్న ఈ 75000 కి ఇంట్రస్ట్ పే చేయవలసి ఉంటుంది.
ఈ ఇంటరెస్ట్ అనేది సుమారుగా ఒక రోజుకి సుమారుగా 0.04% వరకు ఉంటుంది. అనుకుంటే ఈ 75000 కి రోజుకి 30 రూపాయలు ఇంటరెస్ట్ పే చేయవలసి ఉంటుంది. అలా ఎన్ని రోజులు ఈ స్టాక్స్ ని హోల్డ్ చేస్తే అన్ని రోజులకు ఇంట్రస్ట్ పే చేయాలి.

అయితే ఈ ఇంట్రస్ట్ % అనేది ఒక్కొక్క బ్రోకరేజ్ కంపెనీ కి ఒక్కోలా ఉంటుంది. అది మీరు ఉపయోగిస్తున్న బ్రోకరేజ్ కంపెనీ వెబ్సైటు లో చెక్ చేసుకోవచ్చు. అలాగే స్టాక్ ఎక్స్చేంజి లలో కొన్ని వేళా కంపెనీ లు లిస్ట్ అయ్యి ఉన్నాయి. ఆ అన్ని కంపెనీ లకు ఈ MTF ఫీచర్ వర్తించదు. ఇది కంపెనీ కంపెనీ ని బట్టి మారుతూ ఉంటుంది. ఒక కంపెనీ లో ఉండే వోలాటిలిటీ , లిక్విడిటీ, రిస్క్ ని బట్టి ఒక approved లిస్ట్ ఉంటుంది. కేవలం ఆ స్టాక్స్ లకు మాత్రమే ఈ MTF (Margin Trading Facility) ఆప్షన్ ఉంటుంది. అలాగే ప్రతి కంపెనీ స్టాక్ కి 4రెట్ల మార్జిన్ ఇవ్వరు. అది కూడా స్టాక్ ని బట్టి మారుతుంది.

ముందు చెపుకున్నట్టుగా ఒక కంపెనీ స్టాక్ ప్రైస్ (Stock price) లో ఉండే వోలాటిలిటీ (Volatility) , లిక్విడిటీ (Liquidity), ట్రేడింగ్ ఆక్టివిటీ (Trading Activity) ని బట్టి స్టాక్ ఎక్స్చేంజి లు కంపెనీ లను కొన్ని గ్రూప్ లుగా విభజిస్తాయి. ఆ గ్రూప్ ని బట్టి ఎన్ని రెట్ల మార్జిన్ వస్తుంది అనేది డిపెండ్ అవుతుంది.


Margin Trading Facility (MTF) ద్వారా స్టాక్స్ ఎలా కొనాలి?

మీరు Zerodha, Upstox, Angel One ఇలా ఏ Brokerage Platform ఉపయోగిస్తున్న సరే ఆ యాప్ గాని వెబ్సైటు గాని ఓపెన్ చేసి మీరు కొనాలి అనుకున్న స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని బయ్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి.

అక్కడ మీకు 3 ఆప్షన్ లు చూపిస్తాయి.

1. Delivery లేదా Longterm – longterm కోసం స్టాక్స్ కొని హోల్డ్ చెయ్యాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి

2. Intraday లేదా Day Trading – ఈ రోజు కొన్న షేర్ లు ఈ రోజే అమ్మేయాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి

3. MTF – Margin Trading Facility ద్వారా షేర్ లు కొనాలనుకుంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి

అలాగే ఎప్పుడైనా మనం MTF ద్వారా కొన్న షేర్ లను అమ్మాలనుకుంటే నార్మల్ గా డెలివరీ ద్వారా కొని హోల్డ్ చేస్తున్న షేర్ లను ఎలా అమ్ముతామో అలాగే సెల్ల్ చేయవచ్చు.


ఒకసారి మీరు ఈ MTF ద్వారా షేర్ లు కొన్న తరువాత వాటిని మీరు ఎంత కాలం అయినా సరే హోల్డ్ చేసుకోవచ్చు. కానీ మీరు హోల్డ్ చేసిన అన్ని రోజులకు ఇంటరెస్ట్ పే చేయవలసి ఉంటుంది అది గుర్తుంచుకోవాలి.

అలాగే మనం MTF ద్వారా షేర్ లు కొన్న తరువాత ఆ షేర్ బాగా పడిపోతుంటే అప్పుడు margin shortfall ఏర్పడవచ్చు. అలాంటప్పుడు ఆ margin shortfall కి సరిపడా అమౌంట్ ఆడ్ చేయవలసి ఉంటుంది. లేకపోతె ఆ షేర్స్ ని ఆటోమేటిక్ గా అమ్మివేయడం జరుగుతుంది. సో అది కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి.

అలాగే ఈ MTF ని కేవలం ఈక్విటీ (Equity) లో షేర్ లు కొని లాంగ్ టర్మ్ కోసం Hold చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించగలం. Intraday, Futures & Options కి ఇది అప్లై అవ్వదు. ఎలాగో వాటిలో ట్రేడింగ్ చేసేటప్పుడు (Leverage)లేవరేజ్ లభిస్తుంది. కాబట్టి లాంగ్ టర్మ్ లో స్టాక్స్ హోల్డ్ చెయ్యాలి అనుకునేవారికి ఈ MTF హెల్ప్ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *