Options Trading Terminology Telugu – Options లో ఎక్కువగా ఉపయోగించే కొన్ని ముఖ్యమైన పదాలు

Options Trading Terminology in Telugu

మొదటి చాప్టర్ లో Options గురించి తెలుసుకున్నాం. Options గురించి మరింత తెలుసుకోవడానికి ముందు Options లో ఎక్కువగా ఉపయోగించే కొన్ని ముఖ్యమైన పదాలకు అర్థాలు తెలుసుకుందాం. ఇవి బాగా అర్ధం అయితే Options గురించి మరింత బాగా అర్ధం అవుతుంది.

1. Premium: ఒక కాంట్రాక్ట్ ని కొనడానికి లేదా అమ్మడానికి మనం ఎంత ధర అయితే చెల్లిస్తామో దానిని ప్రీమియం అని అంటారు. ఒక ఒప్పందం కుదిరినప్పుడు Buyer , Seller కి ఈ ప్రీమియం ని చెల్లిస్తాడు.

2. Strike price: ఏ ధర వద్ద అయితే Buyer కి Seller కి మధ్య ఒప్పందం కుదురుతుందో ఆ ప్రైస్ ని Strike price అంటారు.

3. Expiration date: ప్రతి ఆప్షన్ కాంట్రాక్టు కి ఒక expiry డేట్ ఉంటుంది. ఆ డేట్ దాటితే ఆ కాంట్రాక్టు ఇక చెల్లదు. ప్రతి కాంట్రాక్ట్ కి కూడా నెలలో చివరి గురువారం expiry గా ఉంటుంది.

Note:

స్టాక్స్ కి సంబంధించినంత వరకు మనకి మంత్లీ కాంట్రక్ట్ ఉంటాయి. కానీ Nifty మరియు Bank Nifty వీక్లీ కాంట్రాక్ట్ లు ఉంటాయి. అంటే ప్రతి వారంలో గురువారం నాడు ఈ కాంట్రాక్ట్ లు expiry అవుతాయి.

4. Spot Price: మనం ముందే చెప్పుకున్నాం ఒక డెరివేటివ్ వాల్యూ అనేది underlying asset మీద ఆధారపడి ఉంటుంది అని. ఈ options ప్రైస్ ఈ Underlying Price ని బట్టి మారుతూ ఉంటుంది. ఉదాహరణకి TCS కంపెనీ కి సంబందించిన Options ప్రైస్ లు దాని యొక్క underlying asset అయినటువంటి TCS Share Price మీద ఆధారపడి ఉంటుంది.

ఇపుడు మనం చెప్పుకున్న వాటిని Option Chain లో చూద్దాం.

ఒక Buyer మరియు Seller కలిసి ఏ Strike Price దగ్గర Contract Build ని చేస్తున్నారో ఆ కాంటాక్ట్ కి ఎంత అయితే ప్రీమియం ఉందో అది buyer, seller కి చెల్లించవలసి ఉంటుంది.

మే నెలలో 27 తారీఖున చివరి గురువారం వచ్చింది కాబట్టి ఆ రోజు మే నెల కాంట్రాక్ట్ Expiry అయిపోతుంది. అలాగే జూన్ నెలలో 24 తారీఖున చివరి గురువారం వచ్చింది. జూన్ 24 న జూన్ నెల కాంట్రాక్ట్ exipry అవుతుంది. ఆ వివరాలు పైన image లో చూడవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *