How to Create a Trading Journal in Telugu – స్టాక్ మార్కెట్ తెలుగు

trading journal stock market

ట్రేడింగ్ జర్నల్ వ్రాసుకోండి & What is Trading Journal ?

మనం ఒకరోజు ట్రేడింగ్ (Trading) చేసిన తరువాత దానిని అలా వదిలిలేయడం కాదు. ప్రతి ట్రేడ్ ని కూడా ఒక బుక్ లో గాని, excel లో గాని నోట్ చేసుకోవాలి. దీనిని ట్రేడింగ్ జర్నల్ (Trading Journal) అంటారు.  ట్రేడర్స్ తమ ట్రేడింగ్స్ ని తరువాత ట్రాక్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ప్రొఫెషనల్ ట్రేడర్స్ అందరూ కూడా ఈ ట్రేడింగ్ జర్నల్ ని మైంటైన్ చేస్తుంటారు. 


ఈ ట్రేడింగ్ జర్నల్ లో Date, Share Name, Quantity, Buy Price, Sell Price, లాభం ఎంత? నష్టం ఎంత?, ఆ రోజు ఏవైనా   events ఉన్నాయా, ఆ ట్రేడింగ్ ఎందుకు చేసారు, ఏ స్టాటజీ ఫాలో అయ్యారు, ఒకవేళ లాస్ వస్తే ఏం తప్పు చేసారు? ఇలా అన్ని నోట్ చేసుకోవాలి. ఆ నోట్ లో మీరు ఎక్కడైనా భయానికి గాని అత్యాశకు గాని గురయ్యారా? ఇలా ప్రతి పాయింట్ కూడా నోట్ చేసుకోవాలి. ఈ ట్రేడింగ్ జర్నల్ (Trading Journal) ని నోట్ చేసేటప్పుడు చాలా నిజాయితీగా ఉండాలి.

మనం చేసిన తప్పులను, వచ్చిన నష్టాలను కప్పిపుచ్చేసి కేవలం లాభాలను మాత్రమే నోట్ చెయ్యడం కాదు. ఇది ఎవరికో చూపించి పేరు సంపాదించడానికి కాదు. మనల్ని మనం ఒక గొప్ప ట్రేడర్ గా తీర్చుదిద్దుకోవడానికి మాత్రమే. అలాగే మనం సక్సెస్ అయిన ట్రేడ్స్ నుండి కన్నా కూడా ఫెయిల్ అయిన ట్రేడ్స్ నుండే మనం ఎక్కువగా నేర్చుకోగలం. కాబట్టి  అన్నీకూడా ఉన్నది ఉన్నట్టుగా నోట్ చేసుకోవాలి.  కుదిరితే ఆ ట్రేడ్ ని ఒక స్క్రీన్ షాట్ తీసుకుని సేవ్ చేసుకుంటే ఇంకా మంచిది.  

దీని వలన మనం ట్రేడింగ్ లో ఎక్కడ తప్పులు చేసాం, ఏ తప్పులు చేసామో గమనించి వాటిని మరలా చెయ్యకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంటుంది. 

ప్రతి రోజు ట్రేడింగ్ లో మనం డబ్బు సంపాదిస్తామో లేదో తెలియదు కానీ ప్రతి రోజు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకోవచ్చు. వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకోలేము.  అది కేవలం ట్రేడింగ్ జర్నల్ ద్వారానే సాధ్యం అవుతుంది. తరువాత వారానికి ఒకసారి గాని నెలకు ఒకసారి గాని ఈ ట్రేడింగ్ జర్నల్ ని తీసి చెక్ చేసుకుని ఏ స్టాటజీ తో మనకు ఎక్కువ లాభాలు వస్తున్నాయి, ఏ స్టాటజీ వలన నష్టాలు వస్తున్నాయి.

వాటిలో ఏవైనా మార్పులు చెయ్యాలా? ఇలా అన్నీ పరిశీలించుకుంటే భవిష్యత్తులో ఎక్కువ నష్టం రాకుండా కాపాడుకోవచ్చు. ఎందుకంటే మనం చేసే తప్పులేంటో మనకే తెలుస్తుంది. వేరే ఎవరో వచ్చి మనల్ని సరిదిద్దరు. మన తప్పులను మనమే సరిద్దుకోవాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *