What is Pledging of Shares in Stock Market in Telugu – Share Pledge in Telugu

మనం అందరం కూడా లాంగ్ టర్మ్ కోసం కొన్ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటాం. ఆ స్టాక్స్ Value పెరుగుతున్నప్పుడు మనకు ప్రాఫిట్ వస్తుంది. కాకపోతే ఆ Investment అలా లాక్ అయిపోయి ఉంటుంది. అలా కాకుండా మనకు ఉపయోగించుకోవడం తెలిస్తే మన దగ్గర ఉన్న ఆ Investment ని మళ్ళీ ఉపయోగించుకుని Extra Income ని సంపాదించే అవకాశం ఉంది. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.


సాధారణంగా మనం బయట ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎవరికైనా డబ్బు కావలిసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులను అంటే బంగారం, స్థలం వంటి వాటిని తాకట్టుగా పెట్టి డబ్బు తెచ్చుకుంటారు మళ్ళీ తీసుకున్న డబ్బుని ఇచ్చేసి తనఖా పెట్టిన దానిని విడిపించుకుంటారు కదా. అలాగే స్టాక్ మార్కెట్ లో కూడా మన దగ్గర ఉన్న షేర్ లను తాకట్టుగా పెట్టి కొంత Margin Money ని తీసుకుని దానితో మనం Trading చేసుకోవచ్చు. దీనిని Pledging అని అంటారు.

ఒకవేళ మీరు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసి ఉండి, Equity, Futures & Options లో ట్రేడింగ్ మీద మంచి అవగాహన ఉన్నవారికి ఈ Pledging చాల బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి అసలు ఈ Pledging అంటే ఏమిటి? ఎలా చేయాలి? దీనిలో ఉండే రూల్స్ ఏంటి ఇలా Pledging గురించి పూర్తిగా ఈ ఇప్పుడు తెలుసుకుందాం.

ఒక్కొక్కసారి ట్రేడింగ్ చేసేటప్పుడు మన దగ్గర సరైన అమౌంట్ లేక కొన్ని కొన్ని లాభాలు వచ్చే Trades ని మిస్ అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన దగ్గర Long Term కోసం Holdings లో ఉన్న షేర్ లను మన బ్రోకరేజ్ కి Pledge చేసి కొంత Margin Amount ని పొందవచ్చు. ఈ అమౌంట్ ని మనం Withdraw చేసుకోవడానికి అవ్వదు. కేవలం ట్రేడింగ్ చేయడానికి మాత్రమే Use చెయ్యాలి.

ఉదాహరణకి నా దగ్గర 100000 రూపాయల విలువైన TCS షేర్ లు ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు నేను వీటిని Pledge చేస్తే 100000 కి 100000 రూపాయలు పూర్తిగా నాకు Margin Amount ఇవ్వరు. దీనిలో సుమారుగా 90% వరకు వరకు నాకు Margin గా వస్తుంది. దీనినే Collateral margin అని కూడా అంటారు. మిగిలిన 10% ఏమిటంటే బ్రోకరేజ్ కంపెనీ లు Safty కోసం కొంత Amount ని కట్ చేస్తాయి. దీనినే Haircut అని అంటారు. ఎందుకంటే మనం Pledge చేసిన తరువాత ఆ షేర్ ప్రైస్ పడిపోయే అవకాశం ఉంది కదా ఆ రిస్క్ ని కవర్ చేయడానికి ఈ హెయిర్ కట్ ని పెట్టారు. ఈ హెయిర్ కట్ అనేది ఒక్కొక్క కంపెనీ కి ఒక్కొక percentage ఉంటుంది. అది ఎంత అనేది మనకు Pledge చేసేటప్పుడు చూపిస్తుంది.

మనం Pledge చేసిన షేర్ లను మరలా Unpledge చేసేవరకు కూడా ఆ షేర్ లను అమ్మడానికి అవ్వదు. అవి లాక్ అయిపోతాయి. ఇలా Pledging చేయడం వలన ఒకవైపు TCS షేర్ వేల్యూ పెరుగుతుంటే మనకు ప్రాఫిట్ వస్తుంది. అలాగే మరొకవైపు ఈ Collateral margin ఉపయోగించుకుని F&O లలో ట్రేడింగ్ చేసి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు. కాబట్టి ఒకే Investment తో రెండు చోట్ల ప్రాఫిట్స్ Gain చేయవచన్నమాట

ఒకవేళ మీరు జీరోధ లో Pledging ఎలా చేయాలో తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చూడండి.

Click Here to Watch >> How to Pledge Shares

మనం F&O లో ఏదైనా ఒక పోసిషన్ తీసుకుని దానిని Over Night క్యారీ చేయాలి అనుకుంటే అంటే Intraday కాకుండా పొజిషనల్ కి తీసుకుంటే మనం తీసుకున్న పోసిషన్ లో 50% Cash ద్వారా అంటే 50% అమౌంట్ ఫండ్స్ లో ఉండాలి మరొక 50% Collateral Margin ని ఉపయోగించుకోవచ్చు. అంటే మీరు Long-term కోసం ఒక 2 లక్షల విలువైన ఒక ఫ్యూచర్ కాంట్రాక్టు ని Buy చేసారు అనుకోండి. ఆ 2 లక్షలలో ఒక లక్ష మనం ఫండ్స్ నుండి పే చేసి మరొక 1 lakh Collateral Margin ని ఉపయోగించుకోవచ్చు. మన దగ్గర Collateral Margin ఎంత ఎక్కువ ఉన్నాగాని ఒక పోసిషన్ లో 50% ఈ Collateral Margin, మరొక 50% ఫండ్స్ ని ఉపయోగించాలి.

ఈ Collateral Margin ని Options Sell చేయడానికి ఉపయోగించుకోవచ్చు. కానీ Buy చేయడానికి అవ్వదు కానీ Option Selling కి, Futures Trading కి, Equity Trading కి ఉపయోగించవచ్చు. అలాగే షేర్స్ ని Pledge చేయడం ద్వారా వచ్చిన ఈ Margin తో మళ్ళీ ఈక్విటీ లో Long Term కోసం షేర్ లను కొనడానికి అవ్వదు.

కాబట్టి ఈ విధంగా షేర్స్ రూపంలో ఉన్న ఇన్వెస్ట్మెంట్ ని కూడా ఈ Pledging ద్వారా Extra Income సంపాదించడానికి ఉపయోగించుకోవచ్చు.

One thought on “What is Pledging of Shares in Stock Market in Telugu – Share Pledge in Telugu”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *