Gift Nifty (గిఫ్ట్ నిఫ్టీ) అంటే ఏమిటి? What is Gift Nifty in Telugu

Gift Nifty Telugu

Gift Nifty గురించి అర్ధం అవ్వాలంటే ముందు కొంచెం SGX Nifty గురించి తెలుసుకోవాలి.

SGX Nifty :

Nifty అంటే మన ఇండియా లోని టాప్ 50 కంపెనీలను సూచించే న్స్ కి సంబందించిన ఇండెక్స్. సింపుల్ గా చెప్పాలంటే మన Nifty కి సంబందించిన Future Contract సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజి లో ట్రేడ్ అవుతూ ఉండేవి. దానిని SGX Nifty అనేవారు.

మన మార్కెట్ లు కేవలం 6 గంటల పాటు ట్రేడ్ అవుతుంటే , సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజి దాదాపుగా 20 గంటల పాటు ఓపెన్ లో ఉంటుంది. అలాగే  FII లు and పెద్ద పెద్ద Hedge Funds వాళ్ళు ఇండియా లో చాలా పెట్టుబడి పెట్టి ఉంటారు. అలాంటి వాళ్లకు వాళ్ళ పొజిషన్స్ కి Hedging కోసం ఈ SGX Nifty లో ట్రేడ్ చేస్తారు.

ఇలా ఎక్కువ సేపు ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒకవేళ మన మార్కెట్ లు క్లోజ్ లో ఉన్నగాని , గ్లోబల్ గా ఎటువంటి న్యూస్ ఉన్న సరే SGX Nifty రియాక్ట్ అవుతుంది. ఆ గ్లోబల్ న్యూస్ కి SGX nifty ఎలా రియాక్ట్ అయ్యిందో చూసి దానిని బట్టి

ఇండియా లొ ఉదయం స్టాక్ మార్కెట్ (Stock Market) లు ఓపెన్ అవ్వడానికి ముందే మన మార్కెట్ లు ఎలా ఉండవచ్చు అనేది మన వాళ్ళు అంచనా వేసేవారు.

అయితే ఇప్పుడు ఈ SGX Nifty ని సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజి నుండి మన దేశంలో గుజరాత్ లో ఉన్నటువంటి  NSE IFSC international exchange కి తరలించారు. అలాగే దాని పేరుని SGX Nifty నుండి Gift Nifty గా మార్చారు.

Gift Nifty (గిఫ్ట్ నిఫ్టీ) :

Gift Nifty పూర్తి పేరు Gujarat International Finance Tec-City Nifty
నిఫ్టీ ఫ్యూచర్స్ US డాలర్-డినామినేటెడ్ కాంట్రాక్ట్‌లు ఇప్పుడు సింగపూర్ ఎక్స్ఛేంజ్‌కు బదులుగా GIFT సిటీ SEZలో ఉన్న NSE IXలో ట్రేడ్‌ అవుతాయి. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ అథారిటీ (IFSCA) రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్ కింద NSE IX పని చేస్తుంది.

మన మార్కెట్ లు క్లోజ్ అయిన తరువాత కూడా Gift Nifty (గిఫ్ట్ నిఫ్టీ) ఓపెన్ ఉంటుంది. కాబట్టి గ్లోబల్ న్యూస్ కి ఇది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది గమనించి, మన దేశంలో ఉదయం మార్కెట్ లు ఓపెన్ అయ్యిన తరువాత మన Nifty ట్రెండ్ ఎలా ఉండవచ్చు అనేది మనం అంచనా వెయ్యవచ్చు

Timings of Gift Nifty:

Gift Nifty F&O కాంట్రాక్టులు రెండు సెషన్ల ద్వారా మొత్తం 21 గంటలా పాటు ట్రేడ్ అవుతుంది.

ఇది మన ఇండియన్ టైం ప్రకారం మొదటి సెషన్ ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 3:40 వరకు ఉంటుంది.

నెక్స్ట్ 55 నిమిషాల విరామం తర్వాత రెండవ సెషన్ 4:35 కి ప్రారంభమై మరుసటి రోజు ఉదయం 2:45 వరకు కొనసాగుతుంది.

How to Check Gift Nifty:

దాదాపుగా అన్ని స్టాక్ బ్రోకింగ్ ఆప్ & వెబ్ సైట్ లలో ఈ Gift Nifty ని చెక్ చెయ్యవచు. లేదా ఈ కింద ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కూడా చెక్ చెయ్యవచు.
https://giftnifty.org

SGX Nifty ని Gift Nifty గా ఎందుకు మార్చారు?

సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజ్‌లో ట్రేడ్ అయ్యే SGX నిఫ్టీ ని జులై 2023 నుండి ఇండియా లో ఉన్న గిఫ్ట్ సిటీలోని NSE IFSC లో ట్రేడ్ అయ్యేలా మార్చబడింది.

దీనివలన ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్ లు ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసేలా చేసి భారతదేశంలో ట్రేడింగ్ వాల్యూం లిక్విడిటీని పెరుగుతుంది. అలాగే విదేశీ పెట్టుబడులు మనదేశంలో పెరుగుతాయి.

SGX Nifty ని Gift Nifty గా పేరు మార్చారు తప్పితే ఈ రెండిటికి ఎటువంటి తేడా లేదు.

SGX Nifty గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ చదవండి. https://stockmarkettelugu.com/sgx-nifty-telugu/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *