3M Rule For Successful Trading in Stock Market – Stock Market Telugu

స్టాక్ మార్కెట్ (Stock Market) లో లాభాలు సంపాదించడానికి పాటించవలసిన 3M’s రూల్:

స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వారు ఫండమెంటల్ గా మంచి స్టాక్స్ ని ఎంచుకుని పెట్టుబడి పెట్టి ఓపికగా ఎదురు చుస్తే చాలు. కానీ ట్రేడింగ్ (Trading) లో అలా కాదు. ఏ రోజుకారోజే షేర్లు కొని అమ్మాలి కాబట్టి ట్రేడింగ్ చేసేవారు ఎక్కువగా ఎమోషన్స్ కి గురవుతూ ఉంటారు. దానిలో భాగంగా ఎక్కువ మంది ట్రేడర్స్ నష్టపోతుంటారు. కాబట్టి స్టాక్ మార్కెట్ లో ముఖ్యంగా ట్రేడింగ్ లో సక్సెస్ అవ్వాలనుకునేవారు ఖచ్చితంగా 3M’s రూల్ ని ఫాలో అవ్వాలి. ఈ 3M’s రూల్ ని ఫాలో అయ్యినప్పుడు మాత్రమే మనం నష్టాలను తగ్గించుకుని లాభాలను పొందగలం. అసలు ఈ 3M’s అంటే ఏమిటి? వాటిని ఎలా ఫాలో అవ్వాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.


ఈ 3M రూల్ లో మూడు M లు ఉంటాయి. 1.Mind. 2.Method 3. Money మన స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ మూడింటింటిని ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఒక్కొక్కదాని గురించి వివరంగా తెలుసుకుందాం.

1. మైండ్ (Mind):

ట్రేడింగ్ లో మనం షేర్ కొన్న తరువాత షేర్ పైకి వెళ్తున్న, క్రిందకి పడుతున్న రెండు వైపులా మనం ఎమోషన్స్ కి గురవుతూ ఉంటాం . మన కొన్న తరువాత కిందకు పడితే ఎంత వరకు కింద పడుతుందో ఎంత నష్టం వస్తుందో భయం. పోనీ షేర్ పైకి వెళ్తే ఎంతో కొంత Profit తీసుకోవాలి కానీ ఇంకా పెరుగుతుందేమో అని ఆశతో ఎదురుచూస్తాం. చివరకి వచ్చిన లాభాన్ని కూడా కోల్పోతుంటాం. ఇలా పడిపోతుంటే భయం, పెరుగుతుంటే ఆశ ఈ రెండు మనల్ని ఆడిస్తుంటాయి. మనం వాటికి లోనవకుండా ఉండాలంటే మనం క్రమశిక్షణతో ఉండాలి. ఖచ్చితంగా స్టాప్ లాస్ (Stop loss), టార్గెట్ (Target) సెట్ చేసుకుని వాటిని టచ్ అవ్వగానే బయటకి వచ్చేయాలి. కొంతమంది ఈ ఎమోషన్స్ కి గురై ఈ టార్గెట్ లను స్టాప్ లాస్ లను మార్చేసుకుంటూ ఉంటారు. అది చాలా తప్పు. మరి కొంతమంది అయితే Revenge Trading చేస్తుంటారు. అంటే ఒకవేళ లాస్ వస్తే ఎలాగైనా ఆ లాస్ ని కవర్ చెయ్యాలని మళ్ళీ ట్రేడింగ్ చేస్తారు. అసలే అప్పటికే లాస్ వచ్చి నెగటివ్ ఎమోషన్స్ లో ఉంటారు. దాంతో మరిన్ని తప్పులు చేస్తుంటారు.

కాబట్టి ఎట్టి పరిస్థితులలోను ట్రేడింగ్ చేస్తున్నపుడు ఎటువంటి ఎమోషన్స్ కి గురికాకండి. అంతేకాదు కొంతమంది ఆ రోజు లాస్ వస్తే ఆ రోజంతా నిరాశతో ఉంటారు. అది కూడా మంచిది కాదు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి మనం స్టాక్ మార్కెట్ ని కంట్రోల్ చెయ్యలేము మనం చేయగలిగిందల్లా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడమే.

2. మెథడ్ (Method):

ఇది మనకు స్టాక్ మార్కెట్ లో ఎంత నాలెడ్జ్(Knowledge) ఉంది అనేదాని మీద ఆధారపడుతుంది. ప్రతి ఒక్కరు ఏ షేర్ ని, ఏ ప్రైస్ దగ్గర కొనాలి, ఏ ప్రైస్ దగ్గర అమ్మాలి అని ఒక మెథడ్ అంటే ఒక స్ట్రాటజీ (Strategy) ని ఆధారంగా చేసుకుని ట్రేడింగ్ చేస్తుంటారు. ఒకవేళ ఆ స్ట్రాటజీ లో లాస్ వస్తుంటే దానిని మార్చుకోవడం, లేదా వేరే మెథడ్ ని ఫాలో అవుతుంటారు.

దాని కోసం మనం టెక్నికల్ ఎనాలిసిస్ (Technical Analysis) లో ఉండే రకరకాల ఇండికేటర్స్, గ్రాఫ్స్, టూల్స్ గురించి నేర్చుకుని ఏ ఇండికేటర్స్ ని ఉపయోగిస్తే మనకి మంచి లాభాలు వస్తున్నాయి అనేది చూసుకుని మనకంటూ ఒక స్ట్రాటజీ ని తయారుచేసుకోవాలి.

కానీ కొంతమంది ఎటువంటి స్ట్రాటజీ లేకుండా ఎవరో చెప్పారనో, ఫోన్ కి వచ్చిన మెసేజ్ లను చూసి ఏ షేర్ లు పడితే అవి కొనేసి నష్టపోతుంటారు.

ఎంతకాలం అని పక్కవాళ్ళమీద ఆధారపడతాం? మనం కూడా నేర్చుకుని మనకంటూ Trading System ని డెవలప్ చేసుకుంటే ఎవరి మీద ఆధారపడకుండానే సొంతగా ట్రేడింగ్ చేసుకోవచ్చు.

అయితే మనకంటూ ఒక స్ట్రాటజీ ఉండడం ముఖ్యం కాదు మనం ముందు చెప్పుకున్నట్టు ఎటువంటి ఎమోషన్స్ కి గురి కాకుండా ఆ మెథడ్ ని ఖచ్చితంగా ఫాలో అవ్వడం ముఖ్యం.

3 మనీ (Money):

అంటే మీ దగ్గర ఉన్న డబ్బుని ఎలా మేనేజ్ చేస్తున్నారు అని. సింపుల్ గా చెప్పాలంటే మనీ మేనేజ్మెంట్ (Money management) అన్నమాట. అసలు మీ దగ్గర ఎంత డబ్బు ఉంది. దానిలో మీరు ఎంత స్టాక్ మార్కెట్ లో పెడుతున్నారు. అలాగే ఒక ట్రేడ్ లో ఎంతవరకు లాస్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ ఈ మనీ మేనేజ్మెంట్ లోకి వస్తుంది.

ఇది చాలా ముఖ్యమైంది ఎందుకంటే మనం ఎంతకాలం స్టాక్ మార్కెట్ లో ఉండాలో డిసైడ్ చేసేది ఇదే. అసలు మనం స్టాక్ మార్కెట్ లో ఉండాలంటే మన దగ్గర డబ్బు ఉండాలి. మన దగ్గర ఉన్న డబ్బు అంతా ఒకేసారి పెడితే ఒకవేళ నష్టం వస్తే మొత్తం నష్టపోయే అవకాశం ఉంది. సరే మరి ఎంత ఇన్వెస్ట్ చెయ్యాలి అనేది చెప్పడానికి స్టాక్ మార్కెట్ లో ఎక్కువ మంది ఫాలో అయ్యే పద్దతి ఒకటుంది.

మీ దగ్గర ఉన్న మొత్తం మనీ ని ఒకేసారి స్టాక్ మార్కెట్ లో పెట్టకుండా కేవలం 10% మనీ తో మాత్రమే ట్రేడింగ్ చెయ్యండి. ఒకవేళ ఇది కోల్పోయిన మీరు స్టాక్ మార్కెట్ లో కొనసాగడానికి ఇంకా మీ దగ్గర డబ్బు ఉంటుంది.

అలాగే మనం ఒక ట్రేడ్ చేస్తున్నపుడు ఆ రోజు లాస్ 2% మించకుండా ఉండేలా చూసుకోవాలి. ఒకవేళ 2% లాస్ వస్తే వెంటనే ట్రేడ్ క్లోజ్ చేసి బయటకు వచ్చేయాలి. అంటే ఒకవేళ మీరు 100000 రూపాయలతో ట్రేడింగ్ చేస్తున్నట్లైతే ఆ రోజు లాస్ 2000 లకి మించకుండా చూసుకోవాలి. దీనివల్ల మీరు ఎక్కవ కాలం స్టాక్ మార్కెట్ లో కొనసాగగలరు. అదే మీరు ఎటువంటి లిమిట్ పెట్టుకోకుండా ట్రేడింగ్ చేస్తే మొత్తం అమౌంట్ కొద్ది కాలం లోనే కోల్పోయే అవకాశం ఉంది.

అలాగే మనం పెట్టిన క్యాపిటల్ (Capital) మొత్తంలో ఒక నెలలో 6% మించి కోల్పోకుండా చూసుకోవాలి. ఒకవేళ మీరు 6% మించి ఎక్కువగా కోల్పోయినట్లయితే మీరు ట్రేడింగ్ చేస్తున్న స్ట్రాటజీ లో ఏదో లోపం ఉందని అర్ధం. కాబట్టి ఒకవేళ మీరు ఎక్కువగా నష్టపోతుంటే కొంతకాలం ట్రేడింగ్ (Trading) ఆపి మీరు ట్రేడింగ్ చేస్తున్న మెథడ్ ని మార్చుకుని మళ్ళీ ట్రేడింగ్ లోకి రావాలి.

ఇక్కడ చెప్పినట్లు ట్రేడ్ కి 2% , నెలకి 6% అనేవి ఎక్కువ మంది ఫాలో అయ్యేవి. ఒకవేళ మీరు ఎక్కువగా రిస్క్ తీసుకోగలను అనుకుంటే ఈ Percentage( % ) ని మీకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు .

ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో ముఖ్యమైనటువంటి మైండ్ , మనీ, మెథడ్ గురించి తెలుసుకున్నాం కదా.

వీటిలో ఏ ఒక్కటి లేకపోయినా స్టాక్ మార్కెట్ లో డబ్బు నష్టపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సారి ట్రేడింగ్ చేసే ముందు మీరు ఈ మూడింటిని ఫాలో అవుతున్నారా లేదా అనేది చెక్ చేసుకోండి.

Comments

No comments yet. Why don’t you start the discussion?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *