SGX Nifty అంటే ఏమిటి? – What is SGX Nifty in Telugu – Stock Market Telugu

What is SGX Nifty:

ఉదయం మార్కెట్ లు ఓపెన్ అవ్వడానికి ముందు CNBC లాంటి న్యూస్ చానెల్స్ చుస్తే ఎక్కువగా SGX Nifty గురించి వినపడుతుంది. అసలు SGX Nifty అంటే ఏమిటి? దానికి ఎందుకు అంత ప్రాముఖ్యత ఉంది? SGX Nifty ని ఎక్కడ చూడాలి? దానిలో మనం Trade చేయగలమా? దాని వలన మనకు ఏదైనా ఉపయోగం ఉంటుందా? ఇలా SGX Nifty గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

SGX Nifty:

SGX అంటే Singapore Exchange Limited. మనకు NSE (National Stock Exchange) ఎలాగో అలా అన్నమాట.

Nifty అంటే మన ఇండియా కి సంబందించిన ఇండెక్స్. సింపుల్ గా చెప్పాలంటే మన Nifty కి సంబందించిన Future Contract సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజి లో ట్రేడ్ అవుతూ ఉంటాయి.

కానీ ఇండియా లో ఉండే Nifty కాంట్రాక్టు కు , SGX Nifty కాంట్రాక్టు కి చాలా తేడా ఉంటుంది.

ఇండియా లో Nifty కి ఒక Lot కి 75 షేర్ లు ఉంటాయి. Nifty 100 Points పెరిగితే 100 X 75= 7500 Profit అవుతుంది.

కానీ SGX Nifty అలా ఉండదు. ఇక్కడ Lot Size షేర్ లని బట్టి కాదు, US Dollars ని బట్టి ఉంటుంది.

SGX Nifty కి CMP X 2USD గా ఉంటుంది అంటే ఉదాహరణకి SGX Nifty 15000 దగ్గర ఉంది అనుకుంటే 15000 X $2 చెల్లించాలి. ఒకవేళ Nifty 100 పాయింట్స్ పెరిగితే 100 X $2 = $200 ప్రాఫిట్ అవుతుంది ఒక కాంట్రాక్టు కి . అదే 100 పాయింట్స్ డౌన్ అయితే $200 లాస్ వస్తుంది.

SGX Nifty Timings ఏంటి?

ఇది తెలియడానికి ముందు ఒక విషయం తెలుసుకోవాలి. మన ఇండియా లో టైం కి సింగపూర్ లో టైం కి 2 గంటల 30 నిమిషాల టైం తేడా ఉంటుంది. ఉదాహరణకి మనకు ఇక్కడ ఉదయం 6 గంటలు అయితే సింగపూర్ లో ఉదయం 8. 30 అవుతుంది.

మన ఇండియా లో అయితే ఉదయం 9.15 కి మార్కెట్ లు ఓపెన్ అయ్యి మధ్యాహ్నం 3.30 కి క్లోజ్ అవుతాయి కదా, అంటే సుమారుగా 6 గంటలు పాటు ఓపెన్ లో ఉంటాయి కాని సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజి అలా కాదు చాలా ఎక్కువ సేపు ఓపెన్ లో ఉంటుంది. అక్కడ T & T+1 అంటే రెండు sessions లో Singapore Exchnage ట్రేడ్ అవుతుంది.

ముందుగా T session అని ఉంటుంది ఇది మన ఇండియన్ టైం లో ఉదయం 6.30 AM నుండి మధ్యాహ్నం 3.40 వరకు ఉంటుంది. ఈ 3.40 కి T session క్లోజ్ అయిపోతుంది. నెక్స్ట్ 4.10 కి T+1 session స్టార్ట్ అవుతుంది. ఇది మనకి మార్నింగ్ 2.45 వరకు ఉంటుంది.

అంటే మధ్యలో ఉన్న చిన్న బ్రేక్ ని తీసివేస్తే ఉదయం 6.30 నుండి రాత్రి 2. 45 వరకు SGX Nifty ట్రేడ్ అవుతూ ఉంటుంది.

మరింత బాగా అర్ధం అవ్వడం కోసం ఎడమ వైపు సింగపూర్ టైమింగ్స్ , కుడి వైపు ఇండియన్ టైమింగ్స్ ఇచ్చాను చూడండి.

మన మార్కెట్ లు కేవలం 6 గంటల పాటు ట్రేడ్ అవుతుంటే ..సింగపూర్ స్టాక్ ఎక్స్చేంజి దాదాపుగా 20 గంటల పాటు ఓపెన్ లో ఉంటుంది.

ఇలా ఎక్కువ సేపు ట్రేడ్ అవుతుంది కాబట్టి ఒకవేళ మన మార్కెట్ లు క్లోజ్ లో ఉన్నగాని , గ్లోబల్ గా ఎటువంటి న్యూస్ ఉన్న సరే SGX Nifty రియాక్ట్ అవుతుంది. ఆ గ్లోబల్ న్యూస్ కి SGX nifty ఎలా రియాక్ట్ అయ్యిందో చూసి దానిని బట్టి మన Nifty ఎలా ఉండవచ్చు అనేది మన వాళ్ళు అంచనా వేస్తారు.

SGX Nifty లో మనం ట్రేడింగ్ చేయవచ్చా?

మన Nifty నే సింగపూర్ లో ట్రేడ్ అవుతుంది కదా మరి మనం SGX Nifty లో ట్రేడ్ చేయవచ్చా అంటే చేయలేము . మనం ఈ SGX Nifty లోనే కాదు ఇతర దేశాలలో ట్రేడ్ అయ్యే Other derivatives వేటిని మనం ట్రేడ్ చేయడానికి మనకు అనుమతి లేదు. కానీ మన దేశానికే చెందిన NRI లు ఎవరైనా SGX Nifty లో ట్రేడ్ చేయవచ్చు.

SGX Nifty లో ఎవరు Trade చేస్తారు ?

ఎవరైతే మన ఇండియా లోని Nifty లో ట్రేడ్ చేయడానికి పెర్మిషన్ లేదో అలాంటి వాళ్ళకి SGX Nifty మంచి alternative. అంతేకాకుండా FII లు, పెద్ద పెద్ద Hedge Funds వాళ్ళు ఇండియా లో చాలా పెట్టుబడి పెట్టి ఉంటారు. అలాంటి వాళ్లకు వాళ్ళ పొజిషన్స్ కి Hedging కోసం ఈ SGX Nifty లో ట్రేడ్ చేస్తారు.

SGX Nifty ని ఎక్కడ చెక్ చెయ్యాలి? ఎలా చెక్ చెయ్యాలి?

SGX Nifty ని Invesitng.com లో గాని, Money Control లో గాని, లేదా డైరెక్ట్ గా SGX.com Website లో గాని చెక్ చెచెయ్యవచ్చు.

SGX Nifty వలన మనకు ఏమైనా ఉపయోగం ఉందా?

మనం ముందు చెప్పుకున్నట్టు మన మార్కెట్ లు క్లోజ్ అయిన టైం లో కూడా SGX Nifty ఓపెన్ లో ఉంటుంది. కాబట్టి గ్లోబల్ న్యూస్ ముందే కాప్చర్ చేయడం తో SGX Nifty లో ఆల్రెడీ Movement అనేది ఏర్పడుతుంది.

కాబట్టి చాలామంది డైలీ Trading చేసేవారు మన మార్కెట్లు ఓపెన్ అవ్వకముందే ఈ SGX Nifty ని గమనించి మన మార్కెట్ లు ఎలా ఓపెన్ అవ్వవచ్చు అనేది ఒక అంచనా వేసుకుని మన Traders దానికి తగ్గట్టుగా ట్రేడింగ్ కి ప్రిపేర్ అయ్యి ఉంటారు

అయితే దాదాపుగా SGX Nifty ని బట్టి మన Nifty కూడా ఓపెన్ అవ్వడానికి అవకాశం ఉంది కానీ 100% ఆలా జరుగుతుంది అని గ్యారంటీ లేదు.

అయితే అసలు ఏమి తెలియకుండా ఉండడం కంటే SGX Nifty ద్వారా వచ్చే Hint మనకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది.

కాబట్టి మీకు కూడా ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు మన మార్కెట్ లు ఓపెన్ అవ్వడానికి ముందే Global Market లు ఎలా ఉన్నాయి ముఖ్యంగా SGX Nifty ఎలా ఉంది అనేది చూసుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *