మనం ట్రేడింగ్ చేయాలనుకుంటే ఏదో ఒక స్టాక్ బ్రోకింగ్ కంపెనీ(Stock Broking Company) లో డీమ్యాట్ అకౌంట్ (Demat Account) ఓపెన్ చేయవలసి ఉంటుంది. అయితే దీనిలో Full-service brokers & Discount Stock Brokers అని రెండు రకాలు ఉంటాయి. Full-service brokers లలో ఎక్కువ బ్రోకరేజ్ charges ఛార్జ్ చేస్తారు. అయితే research and stock tips, relationship manager, training sessions వంటి బెనిఫిట్స్ ని అందిస్తారు.
అయితే Discount Stock Brokers వీళ్ళు full-service brokers పోల్చితే చాలా తక్కువ బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారు. అంతేకాదు ట్రేడింగ్ చేసేవారికి high speed platform ని కూడా అందిస్తారు. ఒకవేళ మీరు ట్రేడింగ్ చెయ్యాలి అనుకుంటే ఈ Discount Stock Brokers ద్వారా ట్రేడింగ్ చేస్తే చాలా బ్రోకరేజ్ సేవ్ అవుతుంది.
అయితే మార్కెట్ లో చాలా Discount Stock Brokers ఉన్నాయి. వాటిలో Top 5 Discount Stock Brokers గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకుని వీటిలో మీ ట్రేడింగ్ స్టైల్ కి సరిపోతుందో దానిలో Demat Account ఓపెన్ చేసుకోండి.
Zerodha:
జీరోధ – ఇండియాలోనే Best Discount Stock Broker. అసలు ఈ Discount Stock Brokers అనే concept ని తీసుకువచ్చిది ఈ zerodha అని చెప్పవచ్చు. Zerodha 2010 లో స్టార్ట్ అయినా సరే ఎప్పటి నుండో ఉన్న ICICI direct, HDFC Securities, Sharekhan లాంటి కంపెనీ లను దాటుకుని నెంబర్ 1 స్థానానికి చేరుకుంది.
Delivery లో zero brokerage, Intraday లో Equity, F&O, Commodity and Currency Segment లో ఏ ఆర్డర్ కి అయిన Rs 20 బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారు.
వెబ్ సైట్ ద్వారా ట్రేడ్ చేయాలనుకున్నప్పుడు Zerodha Kite కి మించిన Trading Terminal మరొక టెర్మినల్ మరొకటి లేదని చెప్పవచ్చు. చాలా సింపుల్ గా, User friendly గా ఉంటుంది.
అంతేకాదు Zerodha Coin ద్వారా Direct గా మ్యూచువల్ ఫండ్స్ లలో ఇన్వెస్ట్ చెయ్యవచు.
అలాగే స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలనుకునే వారి కోసం Zerodha Varsity అనే Website మరియు App కూడా ఉంది. దీనిలో స్టాక్ మార్కెట్ గురించి చాలా సులువుగా నేర్చుకోవచ్చు.
దీనిలో అకౌంట్ ఓపెన్ చేయడానికి 200 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. Annual Maintenance Charges Rs 300 + 18% GST గా ఉంటాయి. అయితే ఈ అమౌంట్ ని మూడు నెలలకు ఒకసారి Quarterly Charges Rs 75 + 18% GST ఛార్జ్ చేస్తారు.
Click Here >> Open a Demat Account in Zerodha
2. Upstox:
ఇండియా లో ఫాస్ట్ గా Grow అవుతున్న discount broker లలో ఈ Upstox ఒకటి. 2012 లో RKSVపేరుతో మొదలైన ఈ కంపెనీ 2015 లో Upstox గా మారింది. Active clients పరంగా చూస్తే Zerodha తరువాత Upstox రెండవ స్థానంలో ఉంది. దీనిలో Delivery తో పాటుగా Intraday లో Equity, F&O, Commodity and Currency Segment లో ఏ ఆర్డర్ కి అయిన Rs 20 బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారు.
దీనిలో రతన్ టాటా గారు ఇన్వెస్టర్ గా ఉన్నారు కాబట్టి ఇది ఒక నమ్మకమైన కంపెనీ గా నిలుస్తుంది. అలాగే దీనిలో అకౌంట్ ఓపెన్ చెయ్యడం చాలా easy గా, fast గా ఉంటుంది.
దీనిలో మరొక బెస్ట్ ఆఫర్ ఏంటంటే Upstox IndusInd Bank 3-in-1 account కూడా ఓపెన్ చేసుకోవచ్చు. అంటే Upstox లో Demat అకౌంట్ తో పాటుగా IndusInd Bank లో బ్యాంకు అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది. దీని ద్వారా చాల ఫాస్ట్ గా ఫండ్స్ ని transfer చేసుకోవచ్చు.
ఒకవేళ మీరు Upstox IndusInd Bank 3-in-1 account ఓపెన్ చెయ్యాలనుకుంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.
దీనిలో Annual Charges Rs 300 + 18% GST ఉంటాయి. అయితే Upstox లో నెలకి ఒకసారి MMC charges గా Rs. 25 + 18% GST ఛార్జ్ చేస్తారు.
Click Here >> Open a Demat Account in Upstox
3. Angel Broking:
Angel Broking చాలా కాలం నుండి Angel Broking 1987 లో స్థాపించబడి 30 సంవత్సరాలకు పైగా స్టాక్ బ్రోకింగ్ రంగంలో ఒక నమ్మకమైన బ్రాండ్ గా ఉంది. మొదట్లో వీళ్ళు full-service broker గా ఉండేవారు. అయితే ఇప్పుడున్న పోటీని తట్టుకోవడానికి Discount Stock Broker మారిపోయారు. Zerodha, Upstox లో లాగానే Delivery లో zero brokerage, Intraday లో Equity, F&O, Commodity and Currency Segment లో ఏ ఆర్డర్ కి అయిన Rs 20 బ్రోకరేజ్ ఛార్జ్ చేస్తారు.
Angel Broking లో ఉన్న మరొక బెనిఫిట్ ఏమిటంటే Angel Broking రీసెర్చ్ టీం వాళ్ళు ఎప్పటికప్పుడు Stock Recommendations ని అందిస్తారు. దీని ద్వారా ఏ షేర్ ని ఏ ప్రైస్ లో కొనాలి, ఏ ప్రైస్ అమ్మాలి అనే వివరాలు తెలుస్తాయి.
Angel Broking లో మీరు Free గా Demat Account ఓపెన్ చేసుకోవచ్చు. అలాగే మొదటి సంవత్సరానికి ఎటువంటి AMC charges ఉండవు. రెండవ సంవత్సరం నుండి AMC ఛార్జ్ చేస్తారు.
అంతేకాదు Angel Broking ద్వారా Apple, Amazon, Google, Facebook, Tesla వంటి US లోని స్టాక్స్ లలో కూడా ఇన్వెస్ట్ చెయ్యవచు.
Click Here >> Open a Demat Account in Angel Broking
4. 5Paisa
ప్రముఖ Financial services company అయినటువంటి IIFL(India Infoline) 20 సంవత్సరాలకు పైగా Full-service broking గా ఉన్నారు. అయితే వీళ్ళు Discount broking segment లోకి ఎంటర్ అవ్వడం కోసం low brokerage platform ని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో 5Paisa ని స్టార్ట్ చేశారు.
5Paisa లో ప్రతి ఆర్డర్ కి కూడా 20 రూపాయలు brokerage ఛార్జ్ చేస్తారు. ఒకవేళ మీరు కనుక 499 చెల్లించి “Power Investor Pack” plan కి Subscribe అయితే ఆర్డర్ కి కేవలం 10 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తారు.
5Paisa లో మీరు ఫ్రీ గా Demat Account ఓపెన్ చేసుకోవచ్చు. దీనిలో Annual Maintenance Charges – 540 రూపాయలు. కానీ నెలకి Rs 45 రూపాయలు చొప్పున ఛార్జ్ చేస్తారు కానీ అది కూడా ఏదైనా ట్రేడ్ చేసిన నెలలో మాత్రమే. ఆ నెలలో ఎటువంటి ట్రేడ్ చెయ్యకపోతే ఎటువంటి Annual Maintenance Charges తీసుకోరు.
5Paisa కూడా స్టాక్ మార్కెట్ గురించి నేర్చుకోవాలి అనుకునేవారి కోసం 5paisa school అనే Platform ని డెవలప్ చేసారు. దీని ద్వారా కూడా Equity,Commodities,Mutual Funds ఇలా స్టాక్ మార్కెట్ కి సంబందించిన ప్రతి విషయం గురించి కోర్స్ ల రూపంలో నేర్చుకోవచ్చు.
అంతేకాదు 5Paisa ద్వారా Apple, Amazon, Google, Facebook, Tesla వంటి US లోని స్టాక్స్ లలో కూడా ఇన్వెస్ట్ చెయ్యవచు.
Click Here >> Open a Demat Account in 5Paisa
5. Alice Blue
మన ఇండియాలో అతి తక్కువ బ్రోకరేజ్ చేస్తున్న కంపెనీ లలో Alice Blue కూడా ఒకటి. Free delivery trading ని అందిస్తూ Freedom 15 అనే ప్లాన్ ద్వారా equity intraday, F&O, MCX, and currency ఇలా అన్ని segments లో ఆర్డర్ కి కేవలం 15 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు.
Commodity Trading పరంగా చుస్తే South India లో Alice Blue అతి పెద్ద commodity broker గా ఉంది. అంతేకాదు Alice Blue వాళ్ళు algotrading సర్వీసెస్ ని కూడా ఉచితంగా అందిస్తున్నారు.
Alice Blue లో Free గా Demat Account Open చేసుకోవచ్చు. అలాగే AMC charges ₹ 400/- per annum. ఈ అమౌంట్ ని నెలకి Rs.33.30 + GST చొప్పున ఛార్జ్ చేస్తారు.
Click Here >> Open a Demat Account in Alice Blue
చివరగా … ఒక్కొక్క స్టాక్ బ్రోకర్ ఒక్కొక్క రకమైన ఆఫర్స్ ని అందిస్తూ ఉంటారు. అయితే ఏ బ్రోకర్ తక్కువ బ్రోకరేజ్ ని ఛార్జ్ చేస్తున్నారు అనే విషయం తో పాటుగా high-quality trading tools, active customer serviceని అందిస్తున్న స్టాక్ బ్రోకింగ్ కంపెనీ ( Stock Broking Company) లో డీమ్యాట్ అకౌంట్ (Demat Account) ఓపెన్ చేసుకోవడం చాలా ముఖ్యం.